హైదరాబాద్: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 3,801 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 7,47,155 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 4,078 మంది మరణించారు. రాష్ట్రంలో 38,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 7,05,054 మంది రికవరీ చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,570 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి