భౌతిక దూరమే మేలు

ABN , First Publish Date - 2020-06-03T08:17:46+05:30 IST

కరోనా వ్యాప్తిని గణనీయంగా తగ్గించడంలో భౌతిక దూరం పాటించడమే మేలని ఇటీవల నిర్వహించిన వేర్వేరు పరిశోధనల్లో తేలింది. కనీసం రెండు మీటర్ల భౌతిక దూరం పాటిస్తే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని...

భౌతిక దూరమే మేలు

  • ఒక్క రోజు ఉల్లంఘిస్తే 2.4 అదనపు రోజుల వ్యాప్తి


టోరంటో, జూన్‌ 2: కరోనా వ్యాప్తిని గణనీయంగా తగ్గించడంలో భౌతిక దూరం పాటించడమే మేలని ఇటీవల నిర్వహించిన వేర్వేరు పరిశోధనల్లో తేలింది. కనీసం రెండు మీటర్ల భౌతిక దూరం పాటిస్తే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని లాన్సెంట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది. కెనడా మెక్‌మాస్టర్‌ యూనివర్సిటీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. కాగా, కరోనా వైరస్‌ కట్టడిలో ఒక్క రోజు భౌతిక దూరం పాటించకపోతే, అది 2.4 అదనపు రోజుల వైరస్‌ వ్యాప్తికి దారితీస్తుందని ద యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధనలో వెల్లడైంది.

Updated Date - 2020-06-03T08:17:46+05:30 IST