న్యూఢిల్లీ: దేశంలో Corona virus మళ్లీ పలుచోట్ల విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 29 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని 3,410 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మొత్తం 5,24,243 మంది మృతి చెందినట్లు Central Government పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 190.34 కోట్ల Corona vaccine పంపిణీ చేసినట్లు తెలిపింది.