కరోనా పాజిటివిటీ రేటు10 శాతం దాటిన జిల్లాల్లో కఠిన ఆంక్షలు

ABN , First Publish Date - 2021-08-01T14:25:49+05:30 IST

దేశంలో కరోనా సెకెండ్‌వేవ్ అల్లకల్లోలం సృష్టించింది.

కరోనా పాజిటివిటీ రేటు10 శాతం దాటిన జిల్లాల్లో కఠిన ఆంక్షలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకెండ్‌వేవ్ అల్లకల్లోలం సృష్టించింది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు థర్డ్ వేవ్ రాకుండా ఉండేందుకు మరింతగా కఠిన ఆంక్షలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా రాష్ట్రాలలో సమీక్ష నిర్వహించింది. దేశంలోని ఏఏ జిల్లాలలో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికిపైగా ఉందో వాటిపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడిని కఠిన చర్యలు అవలంబించాలని ఆదేశించింది. కరోనా టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని సూచించింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టాలని, తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. 



Updated Date - 2021-08-01T14:25:49+05:30 IST