హైదరాబాద్‌లో పెరిగిపోతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-04-12T13:33:48+05:30 IST

హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో పెరిగిపోతున్న కరోనా కేసులు

హైదరాబాద్ : నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ జోన్ల పరిధిలోని కరోనా పరీకా కేంద్రాల్లో 1,033 మందికి పరీక్ష చేయగా 188 మందికి పాజిటివ్‌గా తేలింది. సరూర్‌నగర్‌ పీహెచ్‌సీలో 131 మందిలో 33 మందికి, మన్సూరాబాద్‌లో 55 మందిలో 10 మందికి,  బాలాపూర్‌లో 135 మందిలో 35 మందికి, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 50 మందిలో ఆరుగురికి, మలక్‌పేటలో 180 మందిలో 13మందికి, శాలివాహననగర్‌లో 68 మందిలో 10మందికి, మాదన్నపేటలో 102 మందిలో నలుగురికి, జాంబాగ్‌లో 80మందిలో 19మందికి, గడ్డిఅన్నారంలో 85 మందిలో 9మందికి, అజంపురలో 58 మందిలో 17 మందికి, హయత్‌నగర్‌లో 89 మందిలో 32మందికి పాజిటివ్‌గా తేలింది. 


300మంది పారిశుధ్య కార్మికులకు వ్యాక్సిన్‌ 

చాదర్‌ఘాట్ ‌: శాలివాహననగర్‌, గడ్డిఅన్నారం, ఆజంపుర పీహెచ్‌సీల్లో 300మంది పారిశుధ్య కార్మికులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు డీసీ రజినీకాంత్‌రెడ్డి తెలిపారు. సర్కిల్‌-6 పరిధిలో ఈ నెల 15లోగా అందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు డీసీ తెలిపారు. 


శానిటేషన్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ 

అబ్దుల్లాపూర్‌మెట్ ‌: పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీకి చెందిన 29 మంది శానిటేషన్‌ సిబ్బంది ఆదివారం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని పీహెచ్‌సీలో కొవిడ్‌ వ్యాక్సి న్‌ వేయించుకున్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ చామ సంపూర్ణవిజయశేఖర్‌రెడ్డి వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి బాదం మిల్క్‌తోపాటు జ్యూస్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ జోర్క గీతాశ్రీరాములు, సిబ్బంది పాల్గొన్నారు.


పోలీసుల అవగాహన 

మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ జానకీరాంరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం అబ్దుల్లాపూర్‌మెట్‌ వారాంతపు సంతలో రైతులకు, వినియోగదారులకు మాస్కులు, భౌతిక దూరం పాటించడంపై అవగాహన కల్పించారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-12T13:33:48+05:30 IST