విజయవాడ : ఇంద్రకీలాద్రిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దుర్గమ్మ ఆలయంలో ఓ అర్చకుడికి నిన్న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసింది. దీంతో అర్చకునితో కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలు చేయించుకోవాలని ఈవో సూచించారు. వారితో పాటు పలువురికి కరోనా లక్షణాలుండటంతో పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఇంద్రకీలాద్రిపై నలుగురు క్షురకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేశఖండనశాలను ఆలయ అధికారులు శానిటైజ్ చేస్తున్నారు.