కరోనా.. కలకలం

ABN , First Publish Date - 2021-02-27T05:46:27+05:30 IST

ఏడాది తిరగక మునుపే మరోమారు కరోనా గుండె దడ పుట్టిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే పాజిటివ్‌ కేసులు పెర గడం, ఇక్కడ అడపాదడపా కొన్నిచోట్ల పాజిటివ్‌లు బయటప డడం అందరినీ కలవరపరు స్తోంది.

కరోనా.. కలకలం

సెకండ్‌ వేవ్‌తో కేంద్ర, రాష్ట్రాల అప్రమత్తం

ముందస్తు ప్రణాళిక .. రోజుకు మూడు వేల పరీక్షలు

ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు.. నిబంధనలపై కఠినం 

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఏడాది తిరగక మునుపే మరోమారు కరోనా గుండె దడ పుట్టిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే పాజిటివ్‌ కేసులు పెర గడం, ఇక్కడ అడపాదడపా కొన్నిచోట్ల పాజిటివ్‌లు బయటప డడం అందరినీ కలవరపరు స్తోంది. అధికారిక లెక్కల ప్రకా రం జిల్లావ్యాప్తంగా శుక్రవారాని కి 93,735 పాజిటివ్‌ కేసులు నమోదవగా... మరో లెక్క ప్రకా రం 96,696 కేసులు వెలుగుచూ శాయి. అధికారిక ప్రకటనలో వున్న సంఖ్యకు ఈ సంఖ్యకు మధ్య మూడున్నర వేల వ్యత్యాసం ఉంది. మృతుల సంఖ్యలోనూ తేడా కనిపిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 542 మంది మృతి చెందగా, ఈ సంఖ్య మొత్తంగా 660 ఉన్న ట్లు తేలింది. గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ ఆరంభమైన తరువాత కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏలూరులో తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. అక్కడ నుంచి ఆరంభమై జిల్లావ్యాప్తంగా పాకి కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో తేరుకుంటున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మళ్లీ అం దరినీ భయభ్రాంతులను చేస్తోంది. మళ్లీ ఎలాంటి ముప్పు వచ్చి పడుతుం దోనని ఆందోళన, బెంగ బయటపడుతోంది. దీని కట్టడికి భౌతిక దూరం పాటిం చాలని, విధిగా మాస్క్‌ ధరించాలని పదేపదే కోరుతున్నా ఆ దిశగా ప్రజల్లో పెద్దగా స్పందన లేకపోవడం దురదృష్టకరం. 


ఇప్పుడేం జరగబోతోందంటే...

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో కేంద్రం వైద్య ఆరోగ్య శాఖాధిపతులను ఇప్పటికే అప్రమత్తం చేసింది. కట్టడి మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలని పరోక్షంగా సూచించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించి కేంద్రం సూచనలను తెలియజేశారు. ఇప్పటి వరకూ అక్కడక్కడ కొన్ని టెస్ట్‌లతోనే సరిపెడుతూ వచ్చారు. ప్రభుత్వాసుపత్రులన్నింటిలోనూ ఎవరికైనా ఆపరేషన్‌ చేయాల్సి వస్తే అలాంటి వారికి, గర్భిణుల విషయంలోనూ అప్రమత్తమై కొవిడ్‌ ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు మొదట ఐదు రోజులు టార్గెట్‌గా తీసుకుని రోజుకు మూడు వేల చొప్పున కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య బృందానికి ఆదేశాలు వెలువడ్డాయి. అంటే వివిధ వృత్తుల్లో కొనసాగుతున్న వారిని పరిగణనలోకి తీసుకుని ఈ పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచించారు.  గత 25 రోజులుగా జిల్లావ్యాప్తంగా నాలుగు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదవుతున్న విషయాన్ని గుర్తుచేశారు. మహారాష్ట్ర, గుజరాత్‌, కర్నాటక రాష్ర్టాల్లో రోజువారీ నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య విస్తారంగా ఉంది. దీంతో ఈ ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చి వెళ్ళినా, ఇక్కడే స్థిరపడిన  వారందరిపై ఒక కన్నేసి ఉంచాలని సీరియస్‌గా ఆదేశించారు. రైళ్లు, బస్సుల్లో ప్రయాణించి వ్యాపారరీత్యా వెళ్ళి వస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఈ పరిస్థితుల్లో అప్రమత్తం అవసరమని వైద్యాధికారులకు ఆ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ సూచనలతో కూడిన ఆదేశాలు జారీచేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ముందు జాగ్రత్తచర్యలపై పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉండా లని అప్రమత్తం చేశారు. డీసీహెచ్‌ఎస్‌, డీఎంహెచ్‌వో, వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లుతో ఇప్పటికే ఒక దఫా చర్చించారు. తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీచేశారు. 


కేసులపై ప్రచారం జోరు

కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉండబోతోందని విస్తృత ప్రచారం జరిగింది. ఫలానా పట్టణంలో ఒకే కుటుంబంలో ఇన్ని కేసులు వచ్చాయని, ఫలానా ఊ ళ్లో విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చిందంటూ రకరకాల ప్రచారాలతో ఊదరగొడు తున్నారు. ఇప్పటికిప్పుడు జిల్లాకు వచ్చిన ప్రమాదం అంటూ ఏమీలేదు. అయినప్పటికీ ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొవిడ్‌ నియంత్రణ చర్య లైన శానిటైజర్‌ వాడడం, మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, సామూహిక ఫంక్షన్లు, జాతర్లకు దూరంగా ఉండడమే మేలు. 

ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలి

డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 26: ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ ఆదేశించారు. వైద్య విధాన పరిషత్‌ 18 ఆసుపత్రుల మెడికల్‌ సూపరింటెండెంట్లతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం  సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అన్ని ఆసుపత్రులలో షుగరు, బీపీ ప్రత్యేక వైద్య పరీక్షలు, వైద్య సేవలందించాలన్నారు. కంటి వ్యాధి సమస్యలు, ఇతర వ్యాధులకు వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులల్లో 24 గంటలూ సేవలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా అత్యవసర వైద్య పరీక్షలు అందించడానికి సిద్దం చేయాలన్నారు. కొవిడ్‌ పరీక్షల నిమిత్తం శ్వాబ్‌ సేకరించే కేంద్రాలను కొనసాగించాలని, ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఎవరైనా కొవిడ్‌ బారినపడితే ఏలూరు ప్రభుత్వాసు పత్రిలో ప్రత్యేకంగా 50 పడకలతో ఏర్పాటుచేసిన కొవిడ్‌ ఆసుపత్రికి పంపిం చాలని, ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద 108 అంబులెన్సును ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. సమాచారం ఇస్తే అది కొవిడ్‌ బాధితుల వద్దకు వస్తుందని సూచించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ పోతుమూడి శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో డాక్టర్‌ పీఏఆర్‌ఎస్‌ శ్రీనివాస్‌, చీఫ్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ పద్మ పలువురు వైద్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-02-27T05:46:27+05:30 IST