పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరోజే 485మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-15T18:58:53+05:30 IST

కరోనా కంగారెత్తిస్తున్నది.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో..

పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరోజే 485మందికి పాజిటివ్‌

కరోనా కంగారు

జిల్లాలో పెరుగుతున్న కేసులు

సాధారణ జ్వరానికి ఆందోళన

భయపడుతున్న జనం

22,550కి చేరిన సంఖ్య

పట్టణాల్లోనే పరుగు


ఏలూరు(ఆంధ్రజ్యోతి): కరోనా కంగారెత్తిస్తున్నది.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జనం భయపడుతున్నారు...ఒంట్లో నలతగా ఉంటే చాలు కరోనా వచ్చేసిందని కంగారుపడిపోతున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలకు వెనకడుగు వేస్తున్నారు. అయినా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 485 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 22,550కి చేరుకుంది. తాడేపల్లి గూడెంలో 62 కేసులు నమోదయ్యాయి. రెండు రోజులుగా తాడేపల్లిగూడెంలో ఇదే స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.


ఏలూరు నగరంలో కేసుల సంఖ్య కొంత మేరకు తగ్గి 57కు పరిమితమైంది. భీమవరంలో 44 కేసులు నమో దవగా కొవ్వూరు 29, తణుకు 16, నిడదవోలు, జంగారెడ్డిగూడెం 13 చొప్పున, నర సాపురం 9, పాలకొల్లు 5 కేసులు నమోద య్యాయి. కాగా గ్రామీణ మండలాల్లో పాలకోడేరు అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి. ఇది మినహా మిగిలిన అన్ని మండలాల్లో 20 కంటే తక్కువ కేసులు నమోదవడం కొంత ఉపశమనం. భీమడోలు 18, ఉండ్రాజవరం 16, ఇరగవరం 14, అత్తిలి 12, కొయ్యల గూడెం, పెనుగొండ, గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి.చాగల్లు 10, జీలుగుమిల్లి, చింతలపూడి, లింగపాలెం, పెంట పాడు, వీరవాసరం, యలమంచిలి, గోపాలపురం, మొగ ల్తూరు, వేలేరుపాడు, కాళ్ల, పోడూరు, దెందులూరు, పెనుమంట్ర మండలాల్లో కేసుల సంఖ్య ఐదు నుంచి పది కేసుల్లోపు వరకూ నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాన్ని కరోనా వణికిస్తోంది. కరోనా కారణంగా శుక్రవారం ఒక్కరోజే పది మంది మృతి చెందారు. 


కంటైన్మెంట్లు ఇవే..

జిల్లాలో నూతనంగా 13 కంటైన్మెంట్‌ జోన్లు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు శుక్రవారం తెలిపారు.అత్తిలి మండలం రామన్న పేట 2వ వార్డు, స్కిన్నెరపురం, గణప వరం మండలం ముప్పర్తిపాడు  రామాలయం వీధి 1,2 వార్డులు,  చర్చి వీధి 7, 8 వార్డులు, ముగ్గళ్ల  4, 2, 3, 5 వార్డులు, టి.నరసాపురం మండలం  బొర్రంపాలెం 3, 4, 5, 7 వార్డులు, పెదవేగి మండలం విజయరాయి 13వ వార్డు,గార్లమడుగు 9వ వార్డు, నరసాపురం మండలం కొత్తపాలెం 12వ వార్డు,భీమడోలు మండలం కురెళ్లగూ డెం 2,3 వార్డులు, ఉండ్రాజవరం మం డలం కె.సావరం 6వ వార్డు, కుక్కు నూరు మండలం గుండంబోరు గ్రా మాల్లో పాజిటివ్‌ కేసులు వచ్చినం దున ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించినట్టు కలెక్టర్‌ తెలిపారు. 


Updated Date - 2020-08-15T18:58:53+05:30 IST