కరోనా లెక్క తేల్చారు.. అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-04-05T17:54:11+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనా ప్రకంపనలు కలకలం రేపుతు న్నాయి. శనివారం వరకు మొత్తం 28 మందికి కరోనా పాజిటివ్‌ సోకిన ట్టు అధికారికంగా ప్రకటించారు. పాజిటివ్‌గా తేలిన వ్యక్తులందరూ ఢిల్లీ మర్కజ్‌ యాత్రకు వెళ్శివచ్చినవారే. పాజిటివ్‌గా నిర్ధారణ అ యిన వారి కుటుంబ

కరోనా లెక్క తేల్చారు.. అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 28 పాజిటివ్‌ కేసులు

అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

వరంగల్ నగరంలోనే 22 కేసుల నమోదు

అందరూ ఢిల్లీ మర్కజ్‌ యాత్రకు వెళ్లివచ్చిన వారే...


వరంగల్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో  కరోనా ప్రకంపనలు కలకలం రేపుతు న్నాయి. శనివారం వరకు మొత్తం 28 మందికి కరోనా పాజిటివ్‌ సోకిన ట్టు అధికారికంగా ప్రకటించారు. పాజిటివ్‌గా తేలిన వ్యక్తులందరూ ఢిల్లీ మర్కజ్‌ యాత్రకు వెళ్శివచ్చినవారే. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారి కుటుంబ సభ్యులను ఇప్పటికే  క్వారంటై న్‌ సెంటర్‌లకు పంపించారు. మరి కొంత మందిని హోమ్‌ క్వారంటైన్‌ చేశారు. పెద్ద ఎత్తున కేసు లు నమోదు కావడంతో  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలకు సం బందించి ఆయా జిల్లాల  కలెక్టర్‌లు, పోలీసు కమిషనర్‌, జిల్లా ఎస్పీలు పకడ్భందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పారిశుధ్యం పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోనే ఏకంగా 22 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కోవిడ్‌ -19 అ ధికారిక బులిటిన్‌ను శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 


దీని ప్రకారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 22, జనగామ -2, వరంగల్‌ రూరల్‌ (ములుగు -02, భూపాలపల్లి -01,)  మహబూబాబాద్‌ 01  మొత్తం ఉమ్మడి జిల్లాలో 28 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసులు నమోదు అయిన వ్యక్తులకు సంబంధించిన వారిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 మందిని క్వా రంటైన్‌ సెంటర్‌లకు తరలించారు.  వీరు నివసించే ప్రాం తాల్లో  జన సంచారం లేకుండా చూస్తున్నారు. పెద్ద సంఖ్య లో కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం  కరోనా నియంత్రణ  చర్యలను వేగవంతం చేసింది. రాత్రి పూట కర్ఫ్యూ పకడ్భందీగా అమలు చేస్తున్నారు..  పాజిటివ్‌ కేసుల నమోదయిన వ్యక్తుల ఇంటి పరిసరాలను బారి కేడ్లతో దారిని మూసి వేశారు. రాక పోకలను నియంత్రి ంచారు. పాజిటివ్‌  వ్యక్తుల ఇంటి నుంచి కిలోమీటర్‌ మేర ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.. ఏకంగా 450 బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టారు.. 


కాగా వరంగల్‌ నగరానికి చెందిన23 మందితో పాటు భూపాలపల్లి, జనగామ జిల్లాలకు చెందిన ఇద్దరిని మొత్తం 25 మంది పాజిటివ్‌ వ్యక్తులను హైదరాబాద్‌ గాంధీ ఆసు పత్రికి తరలించారు. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడంతో వరంగల్‌ నగరంలో హై అలర్ట్‌ వాతావరణం నె లకొంది.  మండిబజార్‌, నిజాంపుర, పోచమ్మ మైదాన్‌, రం గంపేట, చార్‌ బౌళి తదితర ప్రాంతాల్లో ఫైర్‌ ఇంజన్‌లతో రహదారులను దిగ్భందం చేశారు. బారికేడ్‌లు ఏర్పాటుచేసి రాకపోకలను కట్టడి చేశారు. అలాగే పోచమ్మ కుంట, సాబీర్‌ హోటల్‌, కుమార్‌పల్లి మార్కెట్‌, బొక్కలగడ్డ, ఈద్గా, హసన్‌పర్తి, చింతగట్టు, కాజీపేట జంక్షన్‌, పాతిమానగర్‌, మడికొండ బ్రిడ్జి, జులైవాడ, డీఐజీ బిల్డింగ్‌ ఏరియా, సుబే దారి పరిసరాల్లో   హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని మునిసిపల్‌, అగ్నిమాపక శాఖ, వైద్యశాఖాధికారుల పర్యవేక్షణలో పిచి కారి చేశారు. భూపాలపల్లి, ములుగు జిల్లా పస్రా, ఏటూరు నాగారం,  జనగామ పట్టణంలోని గిర్నిగడ్డ, మహబూబా బాద్‌ జిల్లా గడ్డిగూడెం ప్రాంతాల్లో ప్రత్యేకంగా పారిశుధ్య పనులు చేపట్టారు. నగరంలో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలకు సంబంధించి 450 మంది ప్రత్యేక బృందాలతో 15 ప్రాంతాల్లో 45 వేల ఇళ్ళను సర్వే చేయనున్నారు.  ఇక  హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి లో డాక్టర్లపై దాడి జరిగిన నేపథ్యంలో ఎంజీయం ఆసుపత్రికి పూర్తి భద్రత కలిగించారు. ఎస్‌ఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో  సాయుధ పోలీసులు రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు..   


మర్కజ్‌ యాత్రికుల్లో 17 మందికి నెగటివ్‌ 

మర్కజ్‌ యాత్రికులు మొత్తం 42 మందిని గుర్తించి ఎంజీయం ఐసోలేషన్‌ వార్డుకు తరలించి, పరీక్షించగా 25 మంది పాజిటివ్‌గా తేలారు. మిగిలిన 17 మందికి మాత్రం నెగటివ్‌ అని నిర్ధారణ అయిందని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మహబూబాబాద్‌ జిల్లాలో  గడ్డి గూడెంకు చెందిన వ్యక్తి పాజిటివ్‌ వచ్చినప్పటికీ కూడా  ఢిల్లీ మర్కజ్‌ సదస్సుకు హాజరు అయినవాడు కాదు. తిరుగు ప్రయాణంలో ఒకే రైల్లో ప్రయాణం చేయడం వల్ల పాజిటివ్‌గా వచ్చి ఉంటుందంటున్నారు.

Updated Date - 2020-04-05T17:54:11+05:30 IST