విశాఖపట్నం జిల్లాలో మరో 519 మందికి కరోనా పాజిటివ్..

ABN , First Publish Date - 2020-08-18T15:53:04+05:30 IST

జిల్లాలో మరో 519 మందికి కొవిడ్‌-19 వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది..

విశాఖపట్నం జిల్లాలో మరో 519 మందికి కరోనా పాజిటివ్..

జిల్లాలో 25,739కు చేరిన కొవిడ్‌ కేసులు

20,983 మంది డిశ్చార్జ్‌

ఆస్పత్రుల్లో 4,576 మంది

180 మంది మృతి


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 519 మందికి కొవిడ్‌-19 వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 25,739కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 20,983 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మరో 4,576 మంది వివిధ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. వైరస్‌ బారినపడి సోమవారం మరో ఐదుగురు మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 180కు చేరింది.


మాధవధార, మురళీనగర్‌ ప్రాంతాల్లో 32.. మాఽధవధారలోని లాన్సమ్‌ గ్రీన్స్‌, తెన్నేటి నగర్‌, అంబేడ్కర్‌ కాలనీల్లో 14 మంది, మురళీనగర్‌, సత్యానగర్‌, బర్మా క్యాంప్‌ ప్రాంతాల్లో 18 మంది వైరస్‌ బారినపడ్డారు. ఈ రెండు ప్రాంతాల్లో గత కొద్దిరోజుల నుంచి భారీ సంఖ్యలో కేసులు నమోవుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 


సింహాచలంలో 20..: సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 116 మందికి పరీక్షలు నిర్వహించగా, 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

గోపాలపట్నంలో 17..: గోపాలపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన 17 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శ్రీరామ్‌నగర్‌లో నలుగురు, నరసింహనగర్‌లో నలుగురు, టైలర్స్‌ కాలనీలో ముగ్గురు, ప్రశాంతినగర్‌, అజంతా పార్క్‌, పాత గోపాలపట్నం, లక్ష్మీనగర్‌, రామకృష్ణానగర్‌, ఇందిరానగర్‌ ప్రాంతాలకు చెందిన ఒక్కొక్కరు వైరస్‌ బారినపడ్డారు. 

భీమిలిలో 13..: భీమిలి నాలుగో వార్డు పరిధిలోని నిడిగట్టు సచివాలయంలో 52 మందికి పరీక్షలు చేయగా 13 మందికి పాజిటివ్‌ వచ్చింది. 

వేపగుంట ప్రాంతంలో 9: వేపగుంట ప్రాంతంలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. అప్పలనర్సయ్య కాలనీ, నాయుడుతోట సాయిమాధవనగర్‌, ప్రహ్లాదపురంలలో ఇద్దరేసి,  ముత్యమాంబ కాలనీలో వృద్ధుడు, చందనపురి కాలనీ, దత్త సాయినగర్‌లో ఒక్కొక్కరు వైరస్‌ బారినపడ్డారు.

33వ వార్డులో 9..: జీవీఎంసీ 33వ వార్డు తాటిచెట్లపాలెం పరిధిలో తొమ్మిది మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వార్డులో 47 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్‌గా తేలింది. 

ఆరిలోవలో 7..: ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రిలో 148 మందికి పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 44 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. 

పరవాడ మండలం పెదముషిడివాడలో మహిళ, గొర్లెవానిపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన మహిళ వైరస్‌ బారినపడ్డారు. 


కరోనాతో ఐదుగురి మృతి

వైరస్‌ బారినపడి చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతిచెందారు. వీటితో కలిపి జిల్లాలో మరణాల సంఖ్య 180కు చేరింది. జీవీఎంసీ 95వ వార్డు పరిధి లక్ష్మీపురం గవరపాలెం కాలనీకి చెందిన వృద్ధురాలు (62) కరోనాతో మృతిచెందింది. కొద్దిరోజులుగా ఆమె నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ మరణాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. 


అనకాపల్లిలో 29 మందికి పాజిటివ్‌

అన్నీ కొత్తూరు నరసింగరావుపేటలోనే....

అనకాపల్లి టౌన్‌: జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ పరిధి కొత్తూరు నరసింగరావుపేటలో సోమవారం 124 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 29 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని జోనల్‌ కమిషనర్‌ పి.శ్రీరామూర్తి తెలిపారు. వైరస్‌ బారినపడిన వారిలో 18 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. పది మంది హోమ్‌ ఐసోలేషన్‌లో వుండగా, ఐదుగురిని జేఎంజే కేర్‌ సెంటర్‌కు, తొమ్మిది మందికి రేబాక కేర్‌ సెంటర్‌కు,       ఐదుగురిని ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు.


మన్యంలో 23 కేసులు 

పాడేరు ఏజెన్సీలో సోమవారం 23 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ లీలాప్రసాద్‌ తెలిపారు. మొత్తం 60 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 23 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. అరకులోయ మండలంలో 7, జీకే వీధిలో 6, చింతపల్లిలో 5, పాడేరులో 2, హుకుంపేటలో 2, ముంచంగిపుట్టులో ఒకటి చొప్పున కేసులు  నమోదయ్యాయని చెప్పారు.


‘కశింకోట’లో 9..: కశింకోట మండలంలో తొమ్మిది మందికి కరోనా వైరస్‌ సోకింది. శారదానగర్‌లో ఇద్దరు పురుషులు, ఆరేళ్ల చిన్నారి, కొత్తూరు ఎన్‌జీవో కాలనీలో పురుషుడు, బయ్యవరంలో పురుషుడు, జెట్టపురెడ్డితునిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు వైరస్‌ బారినపడ్డారు.

అచ్యుతాపురంలో 4...: అచ్యుతాపురం మండలం హరిపాలెం పీహెచ్‌సీ పరిధిలో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి రజని తెలిపారు. పీహెచ్‌సీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి, ఆమె భర్త,  కుమారుడు, చోడపల్లికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వైరస్‌ బారినపడినట్టు చెప్పారు. 

పాయకరావుపేటలో 3...: పాయకరావుపేటలో ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు శిరీష, మధుబాబు తెలిపారు. స్థానిక దుర్గాకాలనీలో మహిళ, బాలిక, శ్రీరాంపురంలో పురుషుడు వైరస్‌బారిన పడ్డారని చెప్పారు.

ఎలమంచిలిలో 3...: ఎలమంచిలి పట్టణంలో ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు మునిసిపల్‌ ప్రజారోగ్యశాఖాధికారి చిట్టిబాబు తెలిపారు. కొత్తపాలెంలో యువకుడు, ఏఎస్‌ఆర్‌ కాలనీలో మహిళ, నాగేంద్ర కాలనీలో పురుషుడు వైరస్‌ బారినపడ్డారు.

మునగపాకలో 3..: మునగపాక మండలం చూచుకొండ పీహెచ్‌సీ పరిధిలో ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారిణి ఎస్తేర్‌రాణి తెలిపారు. పురుషోత్తపురంలో మహిళ, పురుషుడు, చూచుకొండలో మహిళ వైరస్‌ బారిన పడ్డారన్నారు. 

 బుచ్చెయ్యపేట మండలం సీతయ్యపేటలో యువకుడు, పీపీ అగ్రహారంలో మరో యువకుడు వైరస్‌ బారిన పడ్డారు.

ముంచంగిపుట్టులో ఒక యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని ఎంపీడీవో ఏవీవీ కుమార్‌ తెలిపారు.  


కరోనాతో రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు మృతి

అనకాపల్లి: పట్టణంలోని గవరపాలేనికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు (62) కరోనాతో ఆదివారం రాత్రి మృతిచెందినట్టు బంధువులు తెలిపారు. ఆయన పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సోషల్‌ టీచర్‌గా, ఎన్‌సీసీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఇటీవల వైరస్‌ బారిన పడడంతో చికిత్స నిమిత్తం విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కానీ పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. 


Updated Date - 2020-08-18T15:53:04+05:30 IST