20 వేలు.. అడుగు దూరంలో విశాఖ!

ABN , First Publish Date - 2020-08-10T14:47:05+05:30 IST

జిల్లాల్లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగు తోంది. నిత్యం వందలాది..

20 వేలు.. అడుగు దూరంలో విశాఖ!

కరోనాతో గజగజలాడుతున్న జిల్లా 

శరవేగంగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

మరో 961 మందికి వైరస్‌ నిర్ధారణ

19,905కి చేరిన బాధితులు

కోలుకోవడంతో 12,361 మంది డిశ్చార్జ్‌

ఆస్పత్రుల్లో 7,412 మంది 

చికిత్స పొందుతూ మరో ఆరుగురి మృతి

132కు చేరిన కొవిడ్‌ మరణాలు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగు తోంది. నిత్యం వందలాది మంది వైరస్‌ బారిన పడుతున్నారు. ఆదివారం మరో 961 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 19,905కి చేరింది. వీరిలో 12,361 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 7,412 మంది వివిధ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. వైరస్‌ బారినపడి చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు. వీరితో కలిపి జిల్లాలో కొవిడ్‌ మరణాల సంఖ్య 132కు చేరింది. 


‘నర్సీపట్నం’లో 27 పాజిటివ్‌ కేసులు  

నర్సీపట్నం మునిసిపాలిటీ, మండలంలో ఆది వారం 27 మంది కరోనా బారిన పడినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 23 మంది మునిసిపాలిటీ పరిధిలోనే వున్నారు. శారదానగర్‌లో ముగ్గురు పురుషులు(29, 30, 42), శాంతినగర్‌లో ఇద్దరు మహిళలు(20, 44), ఇద్దరు పురుషులు(22, 49), రామారావుపేటలో ప్రైవేటు వైద్యుడు(33), వెంకునాయుడుపేటలో మహిళ (32), బీసీ కాలనీలో ఇద్దరు మహిళలు(25, 29), శివపురంలో ఇద్దరు పురుషులు (11, 52), గచ్చపువీధిలో పురుషుడు(34), సుబ్బారాయుడుపాలెంలో పురుషుడు(42) వైరస్‌ బారిన పడ్డారు. పెదబొడ్డేపల్లిలో యువకుడు(20), కాపువీధిలో పురుషుడు(33), ప్రాంతీయ ఆస్పత్రిలో పనిచేసే పురుషుడు(39), 24వ వార్డులో మహిళ(32), యాదగిరివీధిలో వృద్ధురాలు(61), బ్రాహ్మణవీధిలో వృద్ధుడు(68), ఎస్సీ కాలనీలో మహిళ(36), ఏడో వార్డులో మహిళ(45), వేములపూడిలో కిరాణా వ్యాపారి(65), గాంధీబొమ్మ వీధిలో వృద్ధుడు(60), ధర్మసాగరం స్టార్‌ హోమ్స్‌లో భార్యాభర్త(31, 32)లకు కరోనా వైరస్‌ సోకింది. 


గోపాలపట్నంలో 22 మందికి వైరస్‌

గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఆదివారం 22 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని  జోన్‌-6 అధికారులు తెలిపారు. 


మన్యంలో 13 పాజిటివ్‌ కేసులు

పాడేరు ఏజెన్సీలో ఆదివారం 13 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయని ఏడీఎం హెచ్‌వో డాక్టర్‌ లీలాప్రసాద్‌ తెలిపారు.


ఏజెన్సీ వ్యాప్తంగా 72 మందికి 

కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 13 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. అనంతగిరిలో 2, హుకుంపేట 2, పాడేరులో 3, సీలేరులో 5, జీకేవీధిలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయన్నారు. ఏజెన్సీలో మొత్తం 296 మంది వైరస్‌బారిన పడినట్టు చెప్పారు. 


జీవీఎంసీ 69, 72 వార్డుల్లో తొమ్మిది.. 

సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 61 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 69, 7 2 వార్డులకు చెందిన తొమ్మిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


ఆరిలోవలో ఏడు.. 

ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రిలో ఆదివారం 56 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


సబ్బవరం మండలంలో నాలుగు..

సబ్బవరం మండలంలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరిపాక శివారు పెద యాతపాలెంలో యువకుడు(17), వృద్ధుడు(71), మహిళ(54), రావులమ్మపాలెంలో ఒక పురుషుడు(43) వైరస్‌ బారినపడ్డారు.

 

‘నక్కపల్లి’లో నాలుగు...

నక్కపల్లి మండలంలో మరో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నక్కపల్లిలో ప్రైవేట్‌ పరిశ్రమ కార్మికుడు(25), అప్పలపాయకరావుపేటలో యువకుడు(22), రాజయ్యపేటలో గర్భిణి(23),  ఉపమాకలో గర్భిణి(20) వైరస్‌బారిన పడ్డారు.  


మునగపాకలో నాలుగు...

మునగపాక మండలంలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. కుంచవానిపాలెంలో పురుషుడు(35), మునగపాకలో పురుషుడు(40), తారకరామారావు కాలనీలో మహిళ(30), పురుషోత్తపురంలో యువకుడు(20) వైరస్‌బారిన పడ్డారు.


కశింకోటలో ముగ్గురికి..

 కశింకోటలో ముగ్గురికి కరోనా సోకింది. బాలికల హైస్కూల్‌ సమీపంలో వృద్ధురాలు (80),  హౌసింగ్‌ కాలనీలో పురుషుడు(39), నూకాంబిక ఆలయ ప్రాంగణంలో పురుషుడు (41)కి వైరస్‌ నిర్ధారణ అయ్యింది.


చోడవరం పట్టణంలో ఆదివారం మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. విద్యానగర్‌లో పురుషుడు(41), వృద్ధుడు(74)కి వైరస్‌ నిర్ధారణ కావడంతో విశాఖ తరలించారు.


పాయకరావుపేట బృందావనంలో పురుషుడు(48)కి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని పీహెచ్‌సీ అధికారులు తెలిపారు.


గొలుగొండ మండలం సీహెచ్‌.నాగాపురంలో వృద్ధురాలు(60)కు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం నర్సీపట్నంలో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని వైద్యాధికారి తెలిపారు.


Updated Date - 2020-08-10T14:47:05+05:30 IST