కరోనా జోరు.. వరుసగా మూడో రోజు వేయికి పైగా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-08-04T19:53:11+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నెలలో వరుసగా మూడో రోజు కూడా వేయికిపైగా కేసులు నమోదయ్యాయి.

కరోనా జోరు.. వరుసగా మూడో రోజు వేయికి పైగా కేసులు నమోదు

మరో 1,049 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

మొత్తం 14,608కి  చేరిన కేసులు


విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నెలలో వరుసగా మూడో రోజు కూడా వేయికిపైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం వివిధ ప్రాంతాలకు చెందిన 1,049 మంది వైరస్‌ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో పాజిటివ్‌ కేసులు 14,608 అయ్యాయి.  వీరిలో 9,098 మంది కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. 5,409 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందడంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 101కి చేరింది.  


పారిశ్రామిక ప్రాంతంలో 46 కేసులు

మల్కాపురం పరిధి పారిశ్రామిక ప్రాంతంలో మరో 46 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 45వ వార్డులో 9 మంది, 46వ వార్డులో 13 మంది, 47వ వార్డులో 13 మంది, 49వ వార్డులో 11 మంది వైరస్‌బారిన పడ్డారు. 


ఆరిలోవలో 45....

ఆరిలోవలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన మరో 45 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఆరిలోవ రిఫరల్‌ వైద్యశాలలో సోమవారం 205 మందికి పరీక్షలు చేయగా వారిలో 45 మందికి పాజిటివ్‌గా తేలిందని డాక్టర్‌ అనిత తెలిపారు. 


అనకాపల్లి ప్రాంతంలో 31 కేసులు

అనకాపల్లిలో సోమవారం 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విజయరామరాజుపేటలో బాలిక(9), నలు గురు మహిళలు(29, 33, 59, 60), బాలుడు(11), ఐదుగురు పురుషులు(16, 30, 31, 34, 38), గవరపాలెంలో నలుగురు పురుషులు(40, 42, 43, 50), మహిళ(27), పట్టణంలో ఓ వ్యక్తి (33), మహిళ(21) వైరస్‌ బారిన పడ్డారు. మిరియాల కాలనీ, మల్లిమణుగులవారి వీధి, కోట్ని వీధి, శ్రీరామ్‌నగర్‌, బోయినవారి వీధి, వేల్పుల వీధి, ఆర్టీసీ కాంప్లెక్స్‌, నరసింగరావుపేట, పిళ్లావారి వీధి, శాంతినగర్‌ ప్రాంతాల్లో చెందిన ఒక్కొక్కరు, పట్టణ పోలీసు స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు(21, 33), తుమ్మపాలలో మహిళ(38) వైరస్‌ బారిన పడ్డారు. దీంతో అనకాపల్లిలో కరోనా సోకిన వారి సంఖ్య 539కి చేరింది.


96, 98 వార్డుల్లో 27 మందికి వైరస్‌

సింహాచలం గ్రామీణఆరోగ్య కేంద్రంలో 96, 98 వార్డులకు చెందిన 72 మందికి సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 27 మందికి పాజిటివ్‌గా తేలింది. 


మాధవధారలో 19 మంది....

మాధవధార ప్రాంతంలో 19 కేసులు నమోదయ్యాయి. కేఎస్సార్‌ ప్లజెంట్‌ వ్యాలీలో మహిళ(49), అంబేడ్కర్‌ కాలనీలో మహిళ (35), యువకుడు(27), మాధవధారలో మహిళ(50), ఇద్దరు వృద్ధురాళ్లు(73) (51), 42 ఏళ్ల వ్యక్తి, ముగ్గురు మహిళలు(30, 32, 37), 46 ఏళ్ల వ్యక్తి, ఎనిమిదేళ్ల వయసుగల ఇద్దరు బాలురు, నాలుగేళ్ల బాలుడు, కళింగనగర్‌లో వ్యక్తి(48), మహత్‌కాలనీలో యువతి(22) యువకుడు(27), 47 ఏళ్ల వ్యక్తితోపాటు మరొకరు వైరస్‌ బారినపడ్డారు. 


సాగర్‌నగర్‌లో 16 మందికి.. 

సాగర్‌నగర్‌ ఆరోగ్య కేంద్రంలో సోమవారం 51 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 16 మందికి పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. వీరిలో ఇద్దరు స్థానికులు, ఒకర మహిళ(53) ఎండాడకు చెందినవారు.  కాగా 13 మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. 


ఏజెన్సీలో 13 మందికి....

పాడేరు ఏజెన్సీలో సోమవారం 49 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 13 మంది వైరస్‌ బారిన పడినట్టు రిపోర్టులు వచ్చాయి.  దీంతో ఏజెన్సీ ఇంతవరకు 190 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


మాడుగులలో పది..

మాడుగుల మండలంలో పది మందికి కరోనా సోకినట్టు ఎంపీడీవో ఎం.పోలినాయుడు తెలిపారు. కింతలి గ్రామంలో తొమ్మిది నెలల గర్భిణి, కాశీపురంలో కిడ్నీ బాధితుడు, కేజేపురంలో నలుగురు, మాడుగులలో ముగ్గురు వైరస్‌బారిన పడ్డారు. 


ఎన్‌ఏడీ సమీపంలో తొమ్మిది... 

ఎన్‌ఏడీ జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. బుచ్చిరాజుపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, ఇద్దరు కుమారులతోపాటు అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు(68), వ్యక్తి(48)కి పాజిటివ్‌ వచ్చింది. శాంతినగర్‌లో వ్యక్తి(48), మహిళ (53), సాకేత్‌పురంలో మహిళ(54) వైరస్‌బారిన పడ్డారు. 


9వ వార్డులో 9 మందికి.. 

విశాలాక్షినగర్‌ పరిధి జీవీఎంసీ తొమ్మిదో వార్డు పరిసర ప్రాంతాల్లో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో జోడుగుళ్లపాలేనికి చెందిన 33, 56, 30 ఏళ్ల వయసుగల మహిళలు, విశాలాక్షినగర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు, 39 ఏళ్ల వ్యక్తి, 31 ఏళ్ల మహిళ, రామాలయం వీధికి చెందిన యువకుడు(21), ఎస్సీ, ఎస్టీ కాలనీకి చెందిన వృద్ధురాలు(62), వృద్ధుడు(73) ఉన్నారు.


వేపగుంట ప్రాంతంలో ఎనిమిది.. 

వేపగుంట ప్రాంతంలో ఎనిమిది మంది వైరస్‌ బారిన పడ్డారు. సింహపురి కాలనీలో ఐదుగురికి, బంటాకాలనీలో ఇద్దరికి, నాయుడుతోట కృష్ణా నగర్‌లో ఒక వ్యక్తికి వైరస్‌ సోకింది. 


అనంతగిరిలో ఏడుగురికి...

అనంతగిరిలో మరో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. 108 అంబులెన్స్‌లో పనిచేస్తున్న ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు టెక్నీషియన్లతోపాటు అనంతగిరి పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లకు కరోనా నిర్ధారణ అయ్యింది. 


ఎంవీపీ కాలనీలో ఏడు..

ఎంవీపీ కాలనీ, అప్పుఘర్‌ ప్రాంతాల్లో సోమవారం ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఎంవీపీ కాలనీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌(59), సెక్టార్‌-12లో వృద్ధుడు(73), అప్పుఘర్‌లో 23, 31 ఏళ్లు వయసు గల వ్యక్తులు, 45, 22 ఏళ్ల మహిళలు, ఎంవీపీ కాలనీలో ఒక మహిళ(44)కు పాజిటివ్‌గా తేలింది.


పెందుర్తి ప్రాంతంలో ఆరు... 

పెందుర్తి గ్రామీణ ప్రాంతంలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లక్ష్మీపురం పోర్టు కాలనీలో ముగ్గురు విద్యార్థులు, గవరపాలెం కాలనీలో వృద్ధురాలు, చింతల అగ్రహారంలో భార్యాభర్తలు వైరస్‌ బారిన పడ్డారు.


మునగపాకలో ఐదుగురికి...

మునగపాక మండంలో మరో ఐదు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అరబ్బుపాలెంలో యువకుడు(35), మునగపాకలో యువకుడు(35), నాగులాపల్లిలో మహిళ(62), ఉమ్మలాడలో వ్యక్తి(34), గణపర్తిలో వ్యక్తి(55) వైరస్‌బారిన పడ్డారు. కాగా మండంలోని తోటాడ గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళకు మరణించిన తర్వాత కరోనా పాజిటివ్‌  రిపోర్టు వచ్చిందని అయిందని వైద్యాధికారి అనిల్‌కుమార్‌ తెలిపారు. వైద్య సేవల నిమిత్తం విశాఖ టీబీ ఆస్పత్రిలో చేర్పించారని, చికిత్స పొందుతూ మధ్యలోనే ఆమె ఇంటికి వచ్చేసిందని చెప్పారు. శనివారం పరిస్థితి విషమించడంతో అనకాపల్లి ఎన్‌టీఆర్‌ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత కరోనా పాజిటివ్‌గా సమాచారం వచ్చిందన్నారు.


సబ్బవరంలో 4..

సబ్బవరం మండలంలో నలుగురికి వైరస్‌ సోకింది. మండల కేంద్రంలో ఒకరు, బాటజంగాలపాలెంలో ఇద్దరు, ఆరిపాకలో ఒకరు కరోనా బారిన పడ్డారు.


చీడికాడలో నలుగురికి..

చీడికాడ మండలంలో నాలుగు పాజిటివ్‌ నమోదయ్యాయి.. జైతవరంలో బావబావమరిది, తహసీల్దార్‌ కార్యాలయంలో ఇద్దరు సిబ్బంది వైరస్‌బారిన పడ్డారు. 


చోడవరంలో నలుగురికి...

చోడవరం పట్టణంలో సోమవారం నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. వెలమవీధిలో ఇద్దరు, తామరచెరువు వీధిలో ఒకరు, రమణయ్యపేటలో ఒకరు వైరస్‌ బారిన పడ్డారు.


పాయకరావుపేట మండలంలో ముగ్గురికి...

పాయకరావుపేట మండలం మంగవరంలో ఒక పురుషుడు(47), ఇద్దరు మహిళలు(50, 37) వైరస్‌బారిన పడినట్టు వైద్యాధికారి మురళీకృష్ణారెడ్డి తెలిపారు. 


పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ పరిధి కోరంగివానిపాలెంలో చెందిన భార్యాభర్తలు(32), (39)లకు కరోనా వైరస్‌ నిర్ధారణ అయింది. 


పెదబయలు రైస్‌మిల్లు సమీపంలోని కాలనీకి చెందిన మహిళ(34) ఒకరు కరోనా వైరస్‌బారిన పడ్డారని పంచాయతీ కార్యదర్శి రవి తెలిపారు.


ఎలమంచిలి పట్టణంలోని పాతవీధికి చెందిన యువకుడి(24)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు మునిసిపల్‌ ప్రజారోగ్యశాఖాధికారి చిట్టిబాబు తెలిపారు. 


రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో వుంటూ, ఎల్‌అండ్‌టీ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి(30)కి వైరస్‌బారిన పడినట్టు వైద్యాధికారి జి.అమృతసాయి తెలిపారు. 


ముగ్గురి మృతి.. 

కరోనా వైరస్‌ బారినపడి సోమవారం మరో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలో కొవిడ్‌ మరణాల సంఖ్య 101కి చేరింది. గాజువాక జోనల్‌ పరిధిలోని వికాస్‌నగర్‌ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసముంటున్న వ్యక్తి(44), జోనల్‌ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తి కరోనా వైరస్‌ లక్షణాలతో సోమవారం మృతి చెందారు. వీరు కరోనా వైరస్‌ లక్షణాలు వుండడంతో వారం రోజులుగా ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. కాగా నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పని చేస్తున్న ఒక హెడ్‌కానిస్టేబుల్‌ కరోనాతో మృతి చెందాడు. ఏఆర్‌ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఇతరె మూడు రోజులుగా ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు. 


అటవీ బీట్‌ అధికారి మృతి

అటవీ బీట్‌ అధికారి ఒకరి కరోనా మృతి చెందాడు. మూడు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన సోమవారం మధ్యాహ్నం చనిపోయారు. దీంతో పాడేరులో కరోనా మరణాలు రెండుకు చేరాయి.


Updated Date - 2020-08-04T19:53:11+05:30 IST