Abn logo
May 20 2020 @ 21:46PM

రష్యాలో 3లక్షలు దాటిన కరోనా కేసులు

మాస్కో: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. తాజాగా రష్యాలో 8,674 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. దీంతో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో 3.08లక్షల కేసులతో రష్యా రెండో స్థానానికి చేరింది. అలాగే ఇక్కడ కొత్తగా 135 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో రష్యాలో సంభవించిన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,972కు చేరింది.