ప్రకాశం జిల్లాలో మరో 476 మందికి పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-12T17:43:56+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ దూకుడు కొనసాగుతోంది. మంగళవారం..

ప్రకాశం జిల్లాలో మరో 476 మందికి పాజిటివ్

దూకుడు తగ్గని కొవిడ్‌

ఒంగోలులో తొలిసారి 124  కేసులు నమోదు


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ దూకుడు కొనసాగుతోంది. మంగళవారం మరో 476 కేసులు వెలుగు చూశాయి. అందులో ఒంగోలులో 124 నమో దయ్యాయి. నగరంలో ఇన్ని ఎక్కువ కేసులు రావడం ఇదే ప్రథమం. చీరాలలో 14, కందుకూరు 10, కనిగిరిలో 14, మార్కాపురంలో 17 కేసులు  వచ్చాయి.  కరోనా కట్టడి కోసం ఇప్పటికే కందుకూరు, మార్కాపురంలో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉండగా, మంగళవారం నుంచి ఒంగోలులోనూ ఆంక్షలు విధించారు. రెండు వారాలపాటు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు ప్రకటించారు.  జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలను సైతం కరోనా కమ్మేసింది. కేవలం సాధారణ ప్రజలే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, రైతులు, దినసరి కూలీలు సైతం వైరస్‌ బారినపడుతున్నారు. 


Updated Date - 2020-08-12T17:43:56+05:30 IST