గల్ఫ్‌కు వెళ్లేందుకు కరోనా టెస్ట్ చేయించుకున్న వ్యక్తికి షాకింగ్ రిజల్ట్..!

ABN , First Publish Date - 2020-08-07T16:27:07+05:30 IST

నిజామాబాద్ జిల్లాలో గురువారం కొత్తగా మరో 107 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారు లు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,574కు చేరిందన్నారు.

గల్ఫ్‌కు వెళ్లేందుకు కరోనా టెస్ట్ చేయించుకున్న వ్యక్తికి షాకింగ్ రిజల్ట్..!

నిజామాబాద్‌ జిల్లాలో కొత్తగా మరో 107 కరోనా కేసులు


నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలో గురువారం కొత్తగా మరో 107 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారు లు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,574కు చేరిందన్నారు. ఇందులో 1,107 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు చికిత్స పొంది 420 మంది డిశ్చార్జి అయినట్టు తెలిపారు. అలాగే జిల్లాలో మంగళవారం కరోనాతో ఇద్దరు మృతిచెందారని, ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 47 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.


డిచ్‌పల్లిలో ఇద్దరికి పాజిటివ్‌ 

డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా పరీక్షలు నిర్వహించగా నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌కు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారి బాబూరావు తెలిపారు. వీరిద్దరు ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉంటున్నారని సూపర్‌వైజర్‌ శంకర్‌ తెలిపారు.


ఫార్మాసిస్టుకి కరోనా 

సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఫార్మాసిస్టుకు, న్యావనందికి చెందిన మరొక రికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వై ద్యాధికారి డాక్టర్‌ మోహన్‌ తెలిపారు. సిరికొండ ఆసుప త్రిలో పనిచేస్తున్న ఫార్మాసిస్టు గురువారం ఇందల్వాయి లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనను హోం ఐసోలేషన్‌లో వుం డాలని ఆదేశించామన్నారు. న్యావనంది గ్రామానికి చెం దిన ఒకరు గల్ఫ్‌కు వెళ్లడానికి కరీంనగర్‌ పట్టణంలో ప రీక్షలు చేయించుకోగా అతనికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ గా నిర్ణారణ అయినట్లు వైద్యాధికారి తెలిపారు. అతన్ని కూడా హోంఐసోలేషన్‌లో ఉండాని సూచించామన్నారు.  


బోధన్‌లో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు

బోధన్‌లో గురువారం రెండు కరోనా పాజిటి వ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. బోధన్‌ ప్రభుత్వ ఆసు పత్రిలో మొత్తం 22 మందికి పరీక్షలు నిర్వహించగా ఇ ద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.


సాలూర పీహెచ్‌సీ పరిధిలో ఇద్దరికి

బోధన్‌ మండలం సాలూర పీహెచ్‌సీ పరిధిలో గురు వారం ఎనిమిది మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారు బోధన్‌ మండ లం ఆచన్‌పల్లివాసులుగా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.


నవీపేటలో ఒకరికి

నవీపేట పీహెచ్‌సీలో గురువారం ఆరుగు రురికి ర్యాపిడ్‌ కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని సూపర్‌వైజర్‌ దేవేందర్‌ తెలిపారు. బాధితుడు స్థానిక యూనియన్‌ బ్యాంకులో పనిచేస్తార ని ఆయన తెలిపారు. దీంతో బ్యాంకులో లావాదేవీలను నిలిపివేసి బ్యాంకులో పనిచేస్తున్న 14 మంది సిబ్బందిని హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. 


రుద్రూరులో ముగ్గురికి

రుద్రూరు ఆసుపత్రిలో గురువారం ఏడు గురికి కరోనా టెస్టులు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారి దిలీప్‌కుమార్‌ తెలిపారు. ఇం దులో రుద్రూరు మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి, ఇద్దరు బోధన్‌కు చెందిన వారు ఉన్నారన్నారు. బోధన్‌కు చెందిన ఇద్దరిలో రుద్రూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు ని ర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఉన్నాడని ఆయన తెలిపారు.  


కోటగిరి మండలానికి చెందిన ఐదుగురికి 

కోటగిరి మండలంలో గురువారం ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపా రు. మండలంలోని ఎత్తొండ గ్రామానికి చెందిన ఇద్దరు, హెగ్డొళీ గ్రామానికి చెందిన ఇద్దరు, కోటగిరి గ్రామానికి చెందిన ఒకరు జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్షలు జరు పుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలి పారు.


మండల కేంద్రానికి చెందిన వ్యక్తి మృతి

కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి(50) క రోనాతో మృతిచెందినట్లు ఎస్సై మశ్చ్యేందర్‌రెడ్డి తెలిపా రు. సదరు వ్యక్తి వారం రోజుల క్రితం తీవ్ర అనారోగ్యా నికి గురై జిల్లా కేంద్రంలో కరోనా టెస్టులు చేయించుకో గా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవే టు ఆసుపత్రికి వెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురు వారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. 


ఎడపల్లిలో తొమ్మిది మందికి

నవీపేట(ఎడపల్లి) ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం 15 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మెడికల్‌ ఆఫీసర్‌ జవేరియాసుల్తానా తెలిపారు. ఇందులో మండ లంలోని జానకంపేటలోని ఒకే కుటుంబానికి చెందిన ఐ దుగురికి కరోనా పాజిటివ్‌ రాగా, ఠాణాకలాన్‌కు చెందిన ఇద్దరు, నిజామాబాద్‌కు చెందిన మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. బాధితులను హోంఐసో లేషన్‌లో ఉంచినట్లు ఆమె పేర్కొన్నారు. 


ఆర్మూర్‌ డివిజన్‌లో 16మందికి పాజిటివ్‌

ఆర్మూర్‌ డివిజన్‌లో గురువారం నిర్వహించిన కరో నా ర్యాపిడ్‌ టెస్టులలో 16మందికి పాజిటివ్‌ నిర్ధారణ అ య్యింది. మొత్తం 42 మందికి టెస్టులు నిర్వహించగా 16మందికి పాజిటివ్‌, 25మందికి నెగిటివ్‌ వచ్చింది. ఒక రి షాంపిల్‌ ఆర్‌టీపీసీఆర్‌కు పంపారు. భీమ్‌గల్‌, దూది గాం, తొర్లికొండ, మునిపల్లి, పోచంపాడ్‌, మోర్తాడ్‌, వే ల్పూర్‌కు చెందిన ఒక్కొక్కరికి, దొన్కల్‌లో ఒకే కుటుం బానికి నలుగురికి, వేల్పూర్‌ పీహెచ్‌సీలో పనిచేసే ఒకరి కి, ఆర్మూర్‌ పట్టణంలోని జిరాయత్‌నగర్‌లో ఒకరికి, పె ర్కిట్‌లో ఇద్దరికి, విశాఖనగర్‌లో ఒకరికి పాజిటివ్‌ నిర్ధా రణ అయ్యింది.


తడపాకల్‌ వీఆర్వోకు కరోనా

ఏర్గట్ల మండలంలోని తడపాకల్‌ వీఆర్వోకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ నరసింహ స్వా మి తెలిపారు. దీంతో మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.


మోర్తాడ్‌ మండలంలో ఐదుగురికి

మోర్తాడ్‌ మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో గురు వారం తొమ్మిది మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి రవికుమార్‌ తెలి పారు. ఐదుగురిలో దొన్కల్‌కు చెందిన మాజీసర్పంచ్‌ కుటుంబసభ్యులు నలుగురికి, మోర్తాడ్‌ బస్టాండ్‌ ప్రాంతంలో ఉంటున్న ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. దొన్కల్‌ మాజీసర్పంచ్‌కు రెండు రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చిన విషయం విధితమే. గురువారం పలు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా నలు గురికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు.


బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరికి కరోనా

బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో స్టాఫ్‌ నర్సుకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఆసుపత్రిలో మూడు ర్యాపిడ్‌ అంటిజన్‌ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి నెగెటివ్‌, ఒకరి కి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు.  


భీమ్‌గల్‌కు చెందిన ఒకరి మృతి 

భీమ్‌గల్‌ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందినట్టు డాక్టర్‌ అజయ్‌పవార్‌ తెలిపారు. సదరు వ్యక్తికి మూడు రోజుల క్రితం పాజిటివ్‌ రావడంతో జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తరలించామని అన్నారు. బుధవారం రాత్రి ఆయన మరణించినట్టు తెలిపారు.

Updated Date - 2020-08-07T16:27:07+05:30 IST