నిజామాబాద్ జిల్లాలో కొత్తగా మరో 100 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-03T17:15:44+05:30 IST

నిజామాబాద్ జిల్లాలో ఆదివారం కొత్తగా మరో 100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికా రులు తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా మరో 100 కరోనా కేసులు

జిల్లాలో 1,310కి చేరిన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య

చికిత్స పొంది 384 మంది డిశ్చార్జి  

జిల్లాలో కరోనాతో ఇప్పటి వరకు 39 మంది మృతి 


నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలో ఆదివారం కొత్తగా మరో 100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికా రులు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కే సుల సంఖ్య 1310కి చేరిందన్నారు. ఇందులో 887 కే సులు యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు చికిత్స పొంది 384 మంది డిశ్చార్జి అయినట్టు తెలిపారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 39 మంది మృతి చెందినట్టు అధి కారులు తెలిపారు.


నలుగురు స్పెషల్‌ పార్టీ కానిస్టేబుళ్లకు

రెంజల్‌ మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో స్పె షల్‌ పార్టీలో పనిచేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఎస్సై రాఘవేందర్‌ తెలిపా రు. వారు గత కొన్ని రోజుల నుంచి కందకుర్తి చెక్‌ పో స్టు వద్ద విధులు నిర్వహిస్తున్నారని, ముందుగా నవీ పేటకు చెందిన ఓ స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో మరో ముగ్గురు స్పెషల్‌ పార్టీ కా నిస్టేబుళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారికి కూ డా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఎస్సై తెలిపారు. 


కరోనాతో బాల్కొండ వాసి మృతి

బాల్కొండ మండలానికి చెందిన ఓ బిల్డర్‌(51) ఆ దివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కరోనాతో మృతి చెందినట్టు తెలిసింది. ఆయన పెద్దకుమారుడు ఇటీవల గల్ఫ్‌ దేశం నుంచి వచ్చి హోంక్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే ఆయన కొడుకు నుంచి తండ్రికి సో కినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. తండ్రి అనారో గ్యం కావడంతో మొదట నిజామాబాద్‌ కేంద్ర ఆసుప త్రికి తరలించగా కరోనా అనుమానిత లక్షణాలతో హై దరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆయన ఇద్దరి కొడుకులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. ఇదిలా ఉండగా బాల్కొండ మండలంలో రెండో కరోనా మరణం నమోదైంది. బిల్డర్‌గా మండలంలో అందరికీ సుపరిచితుడిగా తెలుసు. ఆయన మృతితో మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు.


కరోనా లక్షణాలతో వృద్ధురాలు

డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లికి చెందిన ఓ వృద్ధురాలు(67) కొవిడ్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు గ్రామ సర్పంచ్‌ రాధకిష్టరెడ్డి, వైద్య సిబ్బంది తెలిపారు. గత ఐదు రోజులుగా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందు తూ వృద్ధురాలు మృతి చెందిందని వారు తెలిపారు. గ్రామంలో వృద్ధురాలు మృతి చెండంతో ఆందోళన నెల కొంది. వ్యాపార సంస్థలు, ఉదయం, సాయంత్రం వేళ ల్లో రెండు గంటలు మాత్రమే తెరుస్తూ స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు.  

Updated Date - 2020-08-03T17:15:44+05:30 IST