ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేసుల లెక్కలివీ..!

ABN , First Publish Date - 2020-08-03T17:33:11+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేసుల లెక్కలివీ..!

కొత్త కేసులు 112... జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకరి మృతి


మహబూబ్‌నగర్‌/నాగర్‌కర్నూల్‌(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతి రోజూ వందకు పైగానే కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఆదివారం కూడా 112 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 


మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం 25 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కాగా జిల్లా కేంద్రంలో 15 కేసులు నమోదయ్యాయి. అందులో టీడీ గుట్ట ప్రాంతంలో ఒకే ఇంట్లో నలుగురికి, బండ్ల గేరిలోని కుమ్మరి వాడిలో ఒకటి, వల్లభ్‌నగర్‌లో ఒకటి, కొత్త చెరువు రోడ్‌లోని ఆటో స్టాండ్‌ కాలనీలో రెండు కేసులు వచ్చాయి. ఎర్రసత్యం కాలనీ, హబీబ్‌నగర్‌, మునీర్‌ మజీద్‌, న్యూ ప్రేమ్‌నగర్‌, మర్లు, పద్మావతి కాలనీ ప్రాంతాల్లో ఒకొక్క కేసు నమోదయ్యాయి. మిడ్జిల్‌ మండల కేంద్రంలో ఒకరికి వైరస్‌ సోకింది. జడ్చర్లలోని దేవీ థియేటర్‌ ప్రాంతంలో ఒకే ఇంట్లో ముగ్గురికి వైరస్‌ సోకింది. బంగారు మైసమ్మ దేవాలయం ప్రాంతంలో ఒక్కరికి కరోనా వచ్చింది. దేవరకద్ర మండల కేంద్రం లోని బస్టాండ్‌ ప్రాంతంలో ఒకటి, హరిజనవాడలో ఒకటి, మజీద్‌ ప్రాంతంలో మరొకటి కేసులు నమోద య్యాయి. అడ్డాకుల మండలం జానంపేటలోని ఎస్సీ కాలనీలో ముగ్గురికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. 


జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కోవిడ్‌, ర్యాపిడ్‌ ల్యాబ్‌లలో ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో 25 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అందులో గద్వాల పట్టణంలోనే 12 కేసులు నమోదు అయ్యా యి. గద్వాల పట్టణంలోని నల్లకుంటలో ఒకరికి, భీంనగర్‌ ఒకరికి, బీసీ కాలనీ ఇద్దరికి, శేరెల్లీవీధిలో ఒకరికి, లింగంబాగ్‌కాలనీలో ఇద్దరికి, వేణుకాలనీ ఒకరికి, చిన్న అగ్రహారం ఒకరికి, రెండవ రైల్వేగేట్‌లలో ఒకరి తో పాటు పట్టణంలో మరో ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. మల్ధకల్‌ మండలం బిజ్వారంలో ఆరు, మాన్‌దొడ్డిలో ఒకటి, నందిన్నెలో ఒకటి, మల్దకల్‌ మండలం పెద్దదొడ్డిలో ఒకటి, మానవపాడు మండలం కొర్విపాడులో ఒకటి, అలంపూర్‌ ఎమ్యెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లో మరో రెండు కేసులు వచ్చాయి. వీరితో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిం ది. ఉండగా గద్వాల పట్టణానికి చెందిన ఓ మహిళ కరోనాతో ఆదివారం తెల్లవారుజామున కోవిడ్‌ ల్యాబ్‌ లో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 


నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలోని పంచ లింగాలలో ఒక్కరికి, చిట్యాలలో మరొకరికి పాజిటివ్‌ వచ్చింది. వనపర్తి జిల్లాలో 46 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వనపర్తి పట్టణంలోనే 42 మందికి వైరస్‌ సోకింది. పెబ్బేరులో ముగ్గురికి, ఆత్మకూరులో ఒక్కరికి నిర్ధారణ అయ్యింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2020-08-03T17:33:11+05:30 IST