పదేళ్ల పాపకు కరోనా.. కామారెడ్డిలో మరో 89 కేసులు

ABN , First Publish Date - 2020-08-06T18:27:36+05:30 IST

కామారెడ్డి జిల్లాలో బుధవా రం 89 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఇందులో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 14, దేవు నిపల్లి పీహెచ్‌సీలో 6, రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీలో

పదేళ్ల పాపకు కరోనా.. కామారెడ్డిలో మరో 89 కేసులు

కామారెడ్డి జిల్లాలో 89 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు


కామారెడ్డి టౌన్‌(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో బుధవా రం 89 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఇందులో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 14, దేవు నిపల్లి పీహెచ్‌సీలో 6, రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీలో 3, బాన్సువాడ డివిజన్‌ పరిధిలో 37తో పాటు ఆయా పీహెచ్‌ సీల పరిధిలో మొత్తం 89 పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది.


మాచారెడ్డిలో పదేళ్ల పాపకి..

మాచారెడ్డి గ్రామానికి చెందిన పదేళ్ల పాపకి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి సతీష్‌ తెలిపారు. గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆమెతో కాంటాక్టు అయిన ఉప సర్పంచ్‌ మాచారెడ్డి పీఎచ్‌సీలో కరోనా టెస్టు చేయిం చుకోవడంతో ఈ నెల 4న పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. దీంతో బుధవారం 10 మందికి కరోనా నిర్ధారణ టెస్టు చేయడంతో ఆయన కూతురుకు పాజిటివ్‌ వచ్చిందని వైద్యా ధికారి తెలిపారు.


నస్రుల్లాబాద్‌లో ముగ్గురికి.. 

నస్రుల్లాబాద్‌ మండలంలో మైలారం గ్రామంలో ఒకటి, దుర్కి గ్రామంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ రవిరాజా తెలిపారు. 


రామారెడ్డిలో ఐదుగురికి..

రామారెడ్డి మండల కేంద్రానికి  చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు రామారెడ్డి పీహెచ్‌సీ వైద్యులు షాహిద్‌అలీ తెలిపారు. ఇతను ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. వారిని ఇంటిలో హోంక్వారంటైన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. 


బీబీపేటలో ఒకరికి..

బీబీపేట పీహెచ్‌సీ పరిధిలో బుధవారం ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్‌ నమోదు అయినట్లు వైద్యాధికారి సంతోష్‌ తెలిపారు. ఇటి వల పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి యొక్క కుటుంబసభ్యురాలికి కరోనా సోకినట్లు తెలిపారు.


తాడ్వాయిలో ఒకరి మృతి

తాడ్వాయి మండలంలోని కన్కల్‌ గ్రామంలో కరోనాతో ఒకరు మృతి చెందినట్లు వైద్యాధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన 70సంవత్సరాల వ్యక్తి నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందా డని తెలిపారు.


భిక్కనూరులో ఆరుగురికి..

భిక్కనూరు మండలంలో ఆరుగురికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి రవీందర్‌ బుధవారం తెలిపారు. వైద్యాధికారి మాట్లాడుతూ భిక్కనూరు పీహెచ్‌సీలో 23 మందికి కరోనా పరిక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటి వ్‌గా వచ్చాయన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో రెం డు, కాచాపూర్‌లో ఇద్దరికి, పెద్దమల్లారెడ్డిలో ఒకరికి, రామే శ్వర్‌పల్లిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. వీరందరిని హోంఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. 


వైద్యాధికారిగా శ్రీనివాస్‌ బాధ్యతల స్వీకరణ

భిక్కనూరు మండల వైద్యాధికారిగా బుధవారం శ్రీని స్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు భిక్కనూరులో పని చేసిన శ్రీనివాస్‌ ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లి ఉన్నత చదువును పూర్తి చేసి మరల భిక్కనూరు వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - 2020-08-06T18:27:36+05:30 IST