వెంటాడుతున్న వైరస్‌.. జగిత్యాల జిల్లాలో 64 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-08-13T20:55:13+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ భారీగా న మోదు అవుతున్నాయి. బుధవారం ఏకంగా 64 కే సులు నమోదయ్యాయి. కరోనా వచ్చిన

వెంటాడుతున్న వైరస్‌.. జగిత్యాల జిల్లాలో 64 కరోనా పాజిటివ్‌ కేసులు

ధర్మపురి వివాహ వేడుకల్లో పాల్గొన్న 18 మం దికి కరోనా

కోరుట్లలో ఒకరు మృతి

కోవిడ్‌ నిభందనలు ఉల్లంఘన 

ఐదుగురు పీఎఫ్‌ఐ కార్యకర్తలపై కేసు 


జగిత్యాల (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ భారీగా నమోదు అవుతున్నాయి. బుధవారం ఏకంగా 64 కే సులు నమోదయ్యాయి. కరోనా వచ్చిన వ్యక్తుల కాంటాక్టలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ధర్మపురిలో ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్న 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ధర్మపురి చెందిన అమ్మాయికి, మం చిర్యాలకు చెందిన అబ్మాయికి వారం రోజుల క్రితం ధర్మపురిలో వివాహం జరిగింది. ఇందులో పాల్గొన్న వారిలో 18 మందికి పాజిటివ్‌ అని బు ధవారం తేలింది. అలాగే కోరుట్ల పట్టణానికి చెం దిన ఒకరికి పాజిటివ్‌ రాగా చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో బుధవారం మృతి చెందాడు. జ గిత్యాల జిల్లా కేంద్రంలో 15 మందికి పైగా, మె ట్‌పెల్లిలో 11 మందికి, బీర్‌పూర్‌లో ఒకరికి పాజి టివ్‌ వచ్చింది. వెల్గటూర్‌లో ముగ్గురికి, మల్యాల లో నలుగురికి, జగిత్యాల రూరల్‌ మండలంలో నలుగురికి, మేడిపెల్లి మండలంలో ముగ్గురికి పా జిటివ్‌ వచ్చింది.


కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘన 

జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన ఓ 70 ఏళ్ల వృధ్దుడు మంగళవారం జగిత్యాల ప్ర భుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ మెట్లపై నుం చిజారిపడి మృతి చెందాడు. కరోనా లక్షణాలతో ఆ వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు దృవీకరిం చారు. అయితే కోవిడ్‌ లక్షణాలు ఉండి ఏవరైనా సరే మృతి చెందితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ మృతదేహాన్ని సంస్థలకు గానీ, ఇతర వ్యక్తులకు ఇవ్వకూడదనే నిబంధన ఉంది. ప్రభుత్వం ఆధ్వ ర్యంలోనే అంత్యక్రియలు నిర్వహించాలనే నిబంధ న ఉంది. కానీ ఆ వృద్ధుడి అంత్యక్రియల విష యంలో కొంత మంది పీఎఫ్‌ఐ కార్యకర్తలు ని బంధనలకు విరుద్దంగా మృతదేహాన్ని అప్పగిం చాలని వైద్యులు, పోలీసులతో వాగ్వాదానికి దిగా రు. చివరకు పోలీసుల ఆధ్వర్యంలో అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని పోలీసులు సుమోటోగా తీసుకుని ఐదుగురు పీ ఎఫ్‌ఐ కార్యకర్తలపై బుధవారం కేసు నమోదు చే సినట్టు టౌన్‌ సీఐ జయేష్‌ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-08-13T20:55:13+05:30 IST