గుంటూరు జిల్లాలో కొత్తగా 881 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-08-10T12:42:00+05:30 IST

జిల్లాలో కొత్తగా 881 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి..

గుంటూరు జిల్లాలో కొత్తగా 881 కరోనా పాజిటివ్‌ కేసులు

వీడని వైరస్‌

గుంటూరు నగంలో 313

పిడురాళ్ల, తెనాలి, నరసరావుపేటలో విజృంభణ


గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 881 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకు వెలువడిన ఫలితాలను జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ యాస్మిన్‌ విడుదల చేశారు. గుంటూరు నగరంలో 313 కేసులతో కరోనా విజృంభించింది. నరసరావుపేటలోనూ కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం 100కి అటుఇటుగా కేసులు నమోదు అవుతున్నాయి. నరసరావుపేటలో వైరస్‌ తీవ్ర స్థాయిలో విస్తరిస్తోంది. పట్టణంలోనే కరోనా కేసులు 1000 దాటేశాయి. కొవిడ్‌ మరణాలు 15 నమోదయ్యాయి. ఆదివారం 70 కేసులు కొత్తగా నమోదయ్యాయి.


పట్టణంలో 45, మండలంలోని వివిధ గ్రామాల్లో 25 కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పొట్టిశ్రీరాములు వీధి, రూత్‌డైక్‌మెన్‌ నగర్‌, వెంకటాచారినగర్‌, వినాయకనగర్‌, సుభానినగర్‌ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట మండలంలో 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బొప్పూడిలో 5, మురికిపూడిలో 3, లింగంగుంట్లలో 1 కేసులు నమోదైన వాటిలో ఉన్నాయి. పొన్నూరు పట్టణం, మండలంలో  మొత్తం 51 పాజిటివ్‌  కేసులు నిర్ధారణ అయ్యాయని తహసీల్దార్‌ డి.పద్మనాభుడు  తెలిపారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో 44 పాజిటివ్‌ కేసులు తేలాయని చెప్పారు.


మండలంలోని  ములుకుదురు గ్రామంలో ఒకటి, దండమూడిలో ఒకటి, గాయంవారిపాలెంలో రెండు, ఆరెమండలో రెండు, బ్రాహ్మణకోడూరులో ఒకటి పాజిటివ్‌ కేసులు వచ్చాయని తెలిపారు. తెనాలి పట్టణంలో 66, రూరల్‌ మండలం కొలకలూరు 2, కోపల్లె గుడివాడ, నందివెలుగు, జగ్గడిగుంటపాలెం, పెదరావూరు, తేలప్రోలులో ఒక్కో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి. దాచేపల్లి 8, గురజాల1, మాచవరం 3, పిడుగురాళ్ల 87 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు నిర్థారించారు.


నిజాంపట్నం మండలం బావాజిపాలెం పంచాయతీ అదవల గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు వారం రోజులుగా కరోనాతో బాధపడుతూ హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తహసీల్దార్‌ జి. శ్రీనివాస్‌ తెలిపారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని కొవిడ్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్న ఒకరు కరోనాతో మృతి చెందారు.  


డీఎంహెచ్‌వో విడుదల చేసిన కేసుల జాబితా

గుంటూరు నగరం - 313

పిడుగురాళ్ల - 87

నరసరావుపేట - 81

తెనాలి - 76

పొన్నూరు - 62

చిలకలూరిపేట - 49

తాడికొండ - 29

బాపట్ల - 24

మాచర్ల - 14

దుగ్గిరాల - 11

గుంటూరు రూరల్‌ - 10


జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో  125, మొత్తం 881 కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2020-08-10T12:42:00+05:30 IST