అంతకంతకూ పైకే.. 24 గంటల్లో 1,405 పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-09-19T18:08:24+05:30 IST

గ్రామాల్లో తొలుత అక్కడ క్కడా కనిపించిన కొవిడ్‌ వైరస్‌ కొంతకాలం నుంచి శివారు ప్రాంతా ల్లోకి సైతం పాకుతోంది. తోపుడు బళ్లపై కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు, ఇంటింటికీ మోటారు సైకిళ్లపై వెళ్లి పాలు విక్రయిం చేవారు

అంతకంతకూ పైకే.. 24 గంటల్లో 1,405 పాజిటివ్‌లు

83,852కు చేరిన కొవిడ్‌ బాధితులు. 

తాజాగా ఆరుగురి మృతి.. మొత్తం మరణాలు 478 


కాకినాడ (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో తొలుత అక్కడ క్కడా కనిపించిన కొవిడ్‌ వైరస్‌ కొంతకాలం నుంచి శివారు ప్రాంతా ల్లోకి సైతం పాకుతోంది. తోపుడు బళ్లపై కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు, ఇంటింటికీ మోటారు సైకిళ్లపై వెళ్లి పాలు విక్రయిం చేవారు, వీరి ద్వారా వినియోగదారులకు, వినియోగదారుల ద్వారా వ్యాపారులకు వైరస్‌ సోకుతుంది. దీంతో బాధితుల సంఖ్య పెరుగు తుందే తప్ప, కింద చూపు లేదు. ముఖానికి మాస్కులు, ఎప్పటిక ప్పుడు శానిటైజర్‌ రాసుకుంటున్న వ్యాపారులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా కడియం మండలంలో ఇద్దరు పాల వ్యాపా రులకు పాజిటివ్‌ నిర్ధారణయ్యింది. కొత్తపేట మండలంలో ముగ్గురు చిల్లర వర్తకులు వైరస్‌కు గురయ్యారు. తాజాగా ట్రూనాట్‌ ద్వారా చేసిన పరీక్షల్లో 491, రాపిడ్‌ కిట్‌లతో చేసిన వాటిలో 914 మొత్తం 1,405 మందికి వైరస్‌ సోకింది. దీంతో ప్రస్తుతం 83,852 కేసులకు జిల్లా చేరుకుంది. ఒక్క రోజులో కొవిడ్‌ బాధితులు ఆరుగురు మృతి చెందగా, మొత్తం 478 మరణాలు నమోదయ్యాయి. 

Updated Date - 2020-09-19T18:08:24+05:30 IST