తూ.గో.లో.. నలభైవేల దిశగా కరోనా కేసులు..

ABN , First Publish Date - 2020-08-15T18:40:51+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు నలభైవేల దిశగా పరుగులు తీస్తున్నాయి. అంతకంతకు..

తూ.గో.లో.. నలభైవేల దిశగా కరోనా కేసులు..

జిల్లావ్యాప్తంగా శనివారం 1,146 పాజిటివ్‌లు నిర్ధారణ


కాకినాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ కేసులు నలభైవేల దిశగా పరుగులు తీస్తున్నాయి. అంతకంతకు పరిస్థితిని అదుపుతప్పేలా చేస్తున్నాయి. ఎక్కడికక్కడ వైరస్‌ మహమ్మారి విజృంభించడంతో నిత్యం వెయ్యికిపైగా బాధితులు తేలుతున్నారు. ఇతర జిల్లాలతో పోల్చితే పాజిటివ్‌ కేసులు తూర్పులో అత్యధికంగా నమోదవుతుండడంతో అధికారులు, వైద్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


అటు రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్‌లు జిల్లాలోనే అనే ముద్రపడడంతో అయోమయానికి గురవుతున్నారు. ఎక్కడికక్కడ కొత్తగా కొవిడ్‌ కేర్‌ ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలు పాజిటివ్‌లు నిర్ధారణ అయిన వారికి సిద్ధం చేస్తుండగా, అవేమూలకూ చాలడం లేదు. అటు ఆక్సిజన్‌కు కూడా డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిలో శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతుండడంతో ఆక్సిజన్‌ బెడ్లను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో అదనంగా వెయ్యి ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధం చేస్తున్నారు. ఇదిలాఉంటే జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం వరకు 1,146 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో అత్యధికంగా రాజమహేంద్రవరం నగరంలో 207 కేసులు వెలుగులోకి వచ్చా యి. రూరల్‌లో 69 నమోదయ్యాయి.


కాకినాడ సిటీలో 187, రూరల్‌లో 32 కొవిడ్‌ బాధి తులను గుర్తించారు. అమలాపురం 64, రామచంద్రపురం, యు.కొత్తపల్లిలో చెరో 45 పాజిటివ్‌లు గుర్తించారు. అంబాజీపేట 42, కొత్తపల్లి 41లో నమోదయ్యాయి. అడ్డతీగల 7, అయినవిల్లి 3, అల్లవరం 9, అనపర్తి 5, బిక్కవోలు 7, గండేపల్లి 22, గొల్లప్రోలు 6, కడి యం 8, కాజులూరు 17, కపిలేశ్వరపురం 11, కరప 9, కిర్లంపూడి 28, కోరుకొండ 12, కొత్తపేట 11, కూనవరం 3, మండపేట 5, ముమ్మిడివరం 4, పి.గన్నవరం 19, పెదపూడి 4,పెద్దాపురం 33, పిఠాపురం 32,ప్రత్తిపాడు 16,రాజవొమ్మంగి 13,రాజానగరం 3, రౌతుల పూడి 8, సామర్లకోట 11, శంఖవరం 19, తాళ్లరేవు 3, తొండంగి 5, తుని 16, ఉప్పల గుప్తం 4, ఏలేశ్వరం 22 చొప్పున కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో మొత్తం కొవిడ్‌-19 కేసులు 38,292కి చేరాయి. 1,234 మంది డిశ్చార్జి అయ్యారు.


Updated Date - 2020-08-15T18:40:51+05:30 IST