రాజ‌ధానిలో 50 శాతానికి పెరిగిన కరోనా రిక‌వ‌రీ రేటు

ABN , First Publish Date - 2020-05-23T17:48:16+05:30 IST

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల నుండి ప్రతిరోజూ 500కి పైగా కేసులు నమోదవుతున్నాయి.

రాజ‌ధానిలో 50 శాతానికి పెరిగిన కరోనా రిక‌వ‌రీ రేటు

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల నుండి ప్రతిరోజూ 500కి పైగా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 500 కేసులు, బుధవారం 534, గురువారం 571, శుక్రవారం 660 కేసులు న‌మోద‌య్యాయి. ఇదిలావుంటే మ‌రోవైపు  రోగుల రికవరీ రేటు పెరుగుతుండ‌టం విశేషం. ఢిల్లీలో ప్ర‌స్తుతం రికవరీ రేటు 50 శాతానికి చేరుకుంది. ఇది మంచి సంకేతమ‌ని వైద్య నిపుణులు అంటున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల‌కు సంబంధించి, రికవరీ రేటు ఇటీవ‌లి కాలంలో గణనీయంగా మెరుగుపడుతూ వ‌స్తోంది. ఏప్రిల్ 27 న రికవరీ రేటు 28.2 శాతంగా ఉండ‌గా, ఇది మే 22 నాటికి 47.9 శాతానికి పెరిగింది. ప్రతిరోజూ సుమారు 100 మంది క‌రోనా రోగులు కోలుకుంటున్నారు. తాజాగా ప్రతి రోజు 300 నుండి 400 మంది రోగులు ఆరోగ్య‌వంతులై, డిశ్చార్జ్ అవుతున్నారు. ఢిల్లీలో రోగులు వేగంగా కోలుకోవ‌డం వెనుక వారు య‌వ‌త కావ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు భావిస్తున్నారు. 

Updated Date - 2020-05-23T17:48:16+05:30 IST