చిత్తూరు జిల్లాలో మరో 957 మందికి పాజిటివ్..

ABN , First Publish Date - 2020-08-15T17:59:09+05:30 IST

జిల్లాలో గురువారం రాత్రి 9 నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు..

చిత్తూరు జిల్లాలో మరో 957 మందికి పాజిటివ్..

‌23 వేలు దాటిన కొవిడ్‌ కేసుల సంఖ్య


తిరుపతి(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం రాత్రి 9 నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు మొత్తం 957 మందికి కరోనా సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. వీటిలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు.. 12 గంటల వ్యవధిలో నమోదైనవే 675 ఉన్నాయి. వీటిలో తిరుపతిలో 354, రేణిగుంటలో 61, మదనపల్లెలో 51, తిరుపతి రూరల్‌లో 25, సత్యవేడులో 20, వరదయ్యపాలెంలో 15, చిత్తూరులో 12, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట మండలాల్లో 11 చొప్పున, రొంపిచెర్లలో 10, రామచంద్రాపురంలో 8, పులిచెర్లలో 7, పుత్తూరు, చిన్నగొట్టిగల్లు, నిమ్మనపల్లె మండలాల్లో 5 చొప్పున, తొట్టంబేడు, పీటీఎం, ములకలచెరువు మండలాల్లో 4 చొప్పున, చౌడేపల్లె, పిచ్చాటూరు, బీఎన్‌ కండ్రిగ, నిండ్ర, పుంగనూరు మండలాల్లో 3 చొప్పున, పూతలపట్టు, వడమాలపేట, జీడీనెల్లూరు, రామకుప్పం, కలికిరి, బంగారుపాలెం, చంద్రగిరి మండలాల్లో 2 చొప్పున, నారాయణవనం, పలమనేరు, నగరి, నాగలాపురం, ఏర్పేడు, కేవీబీపురం, పీలేరు, కుప్పం, వెదురుకుప్పం, పాకాల, కురబలకోట, గుడుపల్లె, వాల్మీకిపురం, సదుం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున.. ఇతర జిల్లాలకు చెందినవి 20 వున్నాయి. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 23 వేలు దాటింది.


Updated Date - 2020-08-15T17:59:09+05:30 IST