చెన్నూర్‌లో విజృంభిస్తున్న కరోనా.. తాజాగా 9 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-08-06T22:32:08+05:30 IST

చెన్నూర్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. బుధవారం చెన్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 21 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్‌ వచ్చింది. గడిచిన 15 రోజుల్లో 50మందికి కరోనా రాగా

చెన్నూర్‌లో విజృంభిస్తున్న కరోనా.. తాజాగా 9 పాజిటివ్‌ కేసులు

చెన్నూర్‌(అదిలాబాద్): చెన్నూర్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. బుధవారం చెన్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 21 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి  పాజిటివ్‌ వచ్చింది. గడిచిన 15 రోజుల్లో 50మందికి కరోనా రాగా బుధవారం నిర్వహించిన పరీక్షల్లో 9 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. పట్టణంలోని కొత్తగూడెం కాలనిలో ఒకరికి, చెన్నూర్‌ పోలీస్‌ స్టేష న్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవానుకు, చెన్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే ఇరు వురు సిబ్బందికి, కొత్త బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ టైలర్‌ షాపు నిర్వహకుడికి, కోటబొగుడ ప్రాంతానికి చెందిన ఒకరికి, మండలంలోని కత్తెరశాల గ్రామా నికి చెందిన బైక్‌ మెకానిక్‌ నిర్వహకుడికి, పాత బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ కి రాణషాపు నిర్వహకుడికి, కొత్త బస్టాండ్‌ ప్రాంతం ఒకరికి కరోనా వచ్చింది. మొత్తంగా చెన్నూర్‌ పట్టణంతో పాటు మండలంలో 59 మందికి కరోనా పా జిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


నియంత్రణ చర్యలు కరువు..

చెన్నూర్‌ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో రోజు రోజుకు కరోనా కోరలు చాస్తున్నప్పటికి దాని నియంత్రణలో ఎక్కడ చర్యలు కానరావడం లేదు. ఇటు వైద్యాఽధికారులు కాని అటు రెవెన్యూ అధికారులు కాని పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..


ఐసోలేషన్‌ కిట్లు ఎక్కడ..?

రాష్ట్ర ప్రభుత్వం కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ఐసోలేషన్‌ కిట్లు అందిస్తామని పేర్కొన్నప్పటికి అవి చెన్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం కానరావడం లేదు. గత 15 రోజులుగా చెన్నూర్‌ లో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నప్పటికి కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయిన వారికి మాత్రం ఇంత వరకు కిట్లు పంపిణీ చేయలేదు. టెస్టులు చేసి ఆస్పత్రి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారని భాదితులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 


కంటైన్మెంట్‌లు ఎక్కడ..?

చెన్నూర్‌ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నా కట్టడి ప్రాంతాలను ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. పట్టణంలో కరోనా విస్తరిస్తున్నా  కంటైన్మెంట్‌ ప్రాంతాలు కాని, శానిటేషన్‌ చేసిన దాఖలాలు లేవు. 


హాజీపూర్‌లో ఇద్దరికి..  

హాజీపూర్‌ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఒక నర్స్‌కు పాజిటివ్‌ నిర్ధారణ కాగా ఆమెను బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలించారు. ముల్కల్ల గ్రామంలో నివసించే ఒక గర్భవతి మహిళ ఆరోగ్య పరీక్షల నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి వెళ్ళగా ఆమెకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 


కోటపల్లిలో ఒకరికి..

కోటపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఏడుగురికి కరోనా పరీక్షలను నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యుడు సత్యనారాయణ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆసుపత్రి సిబ్బంది ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కోటపల్లి ఆరోగ్య కేంద్రంలో కరోనా సోకిన సిబ్బంది సంఖ్య రెండుకు చేరింది. 


మందమర్రిలో ఇద్దరు ఆర్‌ఎంపీలకు.. 

మందమర్రి పట్టణంలోని ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనా సోకింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వైద్యశాలకు వచ్చే వారికి  చికిత్సలు అందించారు. రెండు రోజుల క్రితం ఆర్‌ఎంపీలకు కరోనా సోకినట్లు తెలుస్తున్నది. 


కరోనాతో మహిళ మృతి

రామకృష్ణాపూర్‌ పట్టణంలోని ఏ జోన్‌ ప్రాంతానికి చెందిన మహిళ (45) కరోనాతో మృతిచెందింది. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మహిళ మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రి చికిత్స కోసం వెళ్ళగా అక్కడ నిర్వహించిన పరీక్షలలో కరోనా పాజిటివ్‌గా తేలింది. సింగరేణి ఉద్యోగి భార్య అయిన మహిళను రామకృష్ణాపూర్‌ ఏరియాసుపత్రి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించగా మార్గమధ్యంలో మృతిచెందింది. 


లక్షెట్టిపేటలో నిల్‌..

లక్షెట్టిపేట పట్టణంలో బుధవారం ప్రభుత్వాసుపత్రిలో  నిర్వహిం చిన టెస్టులలో ఎవరికి పాజిటివ్‌ రాలేదని వైద్యాధికారి కుమారస్వామి తెలిపారు. లక్షెట్టిపేట పట్టణంలో నలుగురికి, వెంకట్రావుపేట పీహెచ్‌సీలో నలుగురికి కరోనా టెస్ట్‌లు చేయగా అందరికి నెగిటివే వచ్చిందన్నారు. తిరిగి శుక్రవారం కరోనా టెస్ట్‌లు చేయనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-08-06T22:32:08+05:30 IST