New Delhi : భారత్(India)లో రోజువారి కరోనా కేసులు(Corona Cases) స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 17,092 కేసులు నమోదయ్యాయి. 14,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 29 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తంగా కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 5,25,168కి చేరింది.