లక్షన్నర దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-28T05:29:54+05:30 IST

జిల్లాలో గురువారం నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు లక్షన్నర దాటాయి. అధికారికంగా ప్రభుత్వం గురువారం ప్రకటించిన బులిటెన్‌ లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు 1,50,787 కేసులు నమోదయ్యాయి. వారిలో 1,38,237 మంది కోలుకోగా 1,134 మంది మరణించారు. అలాగే 11,416 క్రియాశీల కేసులు ఉండగా, వారు చికిత్సపొందుతున్నారు.

లక్షన్నర దాటిన కరోనా కేసులు

 వేగంగా విస్తరిస్తున్న థర్డ్‌ వేవ్‌

రోజూ వెయ్యికిపైగా పాజిటివ్‌లు

ఇప్పటికే 12వేలకుపైగా నమోదు

ప్రస్తుతం 11416 క్రియాశీలక కేసులు

ఒంగోలు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు లక్షన్నర దాటాయి. అధికారికంగా ప్రభుత్వం గురువారం ప్రకటించిన బులిటెన్‌ లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు 1,50,787 కేసులు నమోదయ్యాయి. వారిలో 1,38,237 మంది కోలుకోగా 1,134 మంది మరణించారు. అలాగే 11,416 క్రియాశీల కేసులు ఉండగా, వారు చికిత్సపొందుతున్నారు. వేగంగా విస్తరిస్తున్న థర్డ్‌ వేవ్‌లోనే జిల్లాలో 12వేలకుపైగా కేసులు నమోదు కాగా 95 శాతం క్రియాశీల కేసులు ఉన్నాయి. జిల్లాలో 2020 మార్చి 18న తొలి కరోనా కేసు ఒంగోలులో నమోదు కాగా తొలి దశలో కొన్నినెలలు, రెండవ దశలో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌వరకు ప్రజలకు ఈ మహమ్మారి వణికించింది. అలా గత ఏడాది నవంబరు ఆఖరు వరకు జిల్లాలో 1,38,709 కేసులు అధికారిక లెక్కల ప్రకారం నమోదు కాగా డిసెంబరు నుంచి తిరిగి థర్డ్‌వేవ్‌ ప్రారంభమైంది. ఆ నెలలో పరిమితంగానే కేసులు వచ్చాయి. అయితే సంక్రాంతి అనంతరం ఒక్కసారిగా వైరస్‌ వ్యాప్తి జోరు పెరిగింది. నిత్యం వెయ్యికిపైగాకేసులు వారం, పదిరోజులుగా జిల్లాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం కూడా 1,259 కేసులు నమోదయ్యాయి. థర్డ్‌ వేవ్‌లోనే 12వేలకుపైగా నమోదయ్యయి. అయితే  అనధికారికంగా రెండురెట్లకుపైగా కేసులు నమోదైనట్లు సమాచారం. 


1,259 కొవిడ్‌ పాజిటివ్‌లు..

ఒకరు మృతి

  జిల్లాలో గురువారం కొత్తగా 1,259 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఒంగోలులో 295, చీరాలలో 150, కందుకూరులో 113, చీమకుర్తిలో 54, లింగసముద్రంలో 46, ఉలవపాడులో 44, ఎన్‌జీపాడులో 39, వేటపాలెంలో 35, జరుగుమల్లిలో 31, త్రిపురాంతకంలో 29, కొండపిలో 27, కొత్తపట్నంలో 26, చిన్నగంజాంలో 24, కనిగిరిలో 24, శింగరాయకొండలో 24, చీమకుర్తిలో 21, తాళ్ళూరులో 19, గుడ్లూరులో 18, పామూరులో 18, వీవీపాలెంలో 18, అద్దంకిలో 17, ఇంకొల్లులో 16, కారంచేడులో 16, ముండ్లమూరులో 16, ఎస్‌ఎన్‌పాడులో 16, కొరిశపాడులో 14, పర్చూరులో 12,పెద్దారవీడులో 11, దర్శిలో 10 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. 


Updated Date - 2022-01-28T05:29:54+05:30 IST