తగ్గిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-18T06:39:00+05:30 IST

నాలుగు రోజులుగా రెండు వేలకు పైగా నమోదవుతూ వస్తున్న కరోనా కేసులు తగ్గాయి.కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గడంతో ఆ మేరకు పాజిటివ్‌ల సంఖ్య కూడా తగ్గింది.

తగ్గిన కరోనా కేసులు

నిర్ధారణ పరీక్షలు తగ్గినందువల్లే


తాజా పాజిటివ్‌లు 1621మంది


మరో 10మంది వైరస్‌తో మృతి


  • తిరుపతి, మే 17 (ఆంధ్రజ్యోతి):నాలుగు రోజులుగా రెండు వేలకు పైగా నమోదవుతూ వస్తున్న కరోనా కేసులు తగ్గాయి.కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గడంతో ఆ మేరకు పాజిటివ్‌ల సంఖ్య కూడా తగ్గింది. నాలుగురోజులుగా రోజువారీ తొమ్మిదివేలకు పైగా జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో 2800దాకా నమోదైన కేసులు తాజాగా 6115 పరీక్షలు మాత్రమే జరగడంతో కేసులు కూడా 1621నమోదయ్యాయి. జిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 1621 కరోనా పాజిటివ్‌ కేసులు, పది మరణాలూ నమోదయ్యాయని రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌ వెల్లడించింది. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 158558కు చేరుకోగా సోమవారం ఉదయానికి 22788 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు పేర్కొన్నారు. ఇక మరణాల సంఖ్య 1104కు పెరిగింది. తాజా కేసుల్లో తిరుపతి నగరంలో 267, చిత్తూరులో 207 వున్నాయి. తిరుపతి రూరల్‌ మండలంలో 68, పుత్తూరులో 53, పలమనేరులో 51, నగరి, పాకాల మండలాల్లో 47 చొప్పున, చంద్రగిరిలో 46, గంగవరంలో 44, పూతలపట్టులో 41, మదనపల్లెలో 35, సదుం, శ్రీకాళహస్తి మండలాల్లో 32 వంతున, పులిచెర్లలో 31, బంగారుపాలెంలో 30, రేణిగుంటలో 29, సోమల, శ్రీరంగరాజపురం మండలాల్లో 26 వంతున, ఐరాల, కుప్పం, పెనుమూరు, పీలేరు, పుంగనూరు, వెదురుకుప్పం మండలాల్లో 25 వంతున, నారాయణవనంలో 24, రామకుప్పంలో 22, వి.కోటలో 19, కేవీబీపురం, సత్యవేడు, యాదమరి మండలాల్లో 17 వంతున, వడమాలపేటలో 16, కేవీపల్లె, రామసముద్రం, విజయపురం మండలాల్లో 14 వంతున, గుడుపల్లెలో 13, కలికిరి, రామచంద్రాపురం మండలాల్లో 12 చొప్పున, పాలసముద్రం, పెద్దపంజాణి మండలాల్లో 11 వంతున, శాంతిపురం, వరదయ్యపాలెం మండలాల్లో 9 వంతున, బీఎన్‌ కండ్రిగ, చౌడేపల్లె, గుడిపాల, కార్వేటినగరం, నాగలాపురం మండలాల్లో 8 వంతున, పిచ్చాటూరు, రొంపిచెర్ల, ఏర్పేడు మండలాల్లో 7 వంతున, బైరెడ్డిపల్లె, తొట్టంబేడు, వాల్మీకిపురం మండలాల్లో 6 వంతున, జీడీనెల్లూరు, నిండ్ర, తవణంపల్లె మండలాల్లో 5 చొప్పున, ఎర్రావారిపాలెంలో 3, చిన్నగొట్టిగల్లు, కలకడ, ములకలచెరువు, తంబళ్లపల్లె మండలాల్లో 2 చొప్పున, గుర్రంకొండ, నిమ్మనపల్లె, పెద్దమండ్యం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.కాగా కొవిడ్‌ బారిన పడి తాజాగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందారు. పీలేరు పట్టణానికి చెందిన షంషీర్‌ (42) వి.కోట మండలం ధనమయ్యగారిపల్లె ప్రాధమికోన్నత పాఠశాలలో హిందీ టీచరుగా పనిచేస్తున్నారు. కరోనా సోకడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు. సోమల  సబ్‌ స్టేషన్‌లో లైన్‌మ్యాన్‌గా పనిచేస్తుండిన గంగాధరం (55) కరోనా సోకిన కారణంగా వారం రోజుల కిందట తిరుపతి పద్మావతీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు.

Updated Date - 2021-05-18T06:39:00+05:30 IST