ప్రపంచవ్యాప్తంగా 45లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-15T17:12:14+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 45లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 45 లక్షలు దాటాయి. ఇప్పటి వరకు 17 లక్షల మందికిపైగా కరోనా వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 45,26,905 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,03,405 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 17,04,268 మంది కోలుకున్నారు. 


అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 14,57,593 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 86,912 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 3,18,027 మంది కోలుకున్నారు. అలాగే స్పెయిన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,72,646 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 27,321 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,86,480 మంది కోలుకున్నారు. రష్యాలో గత 24 గంటల్లో మొత్తం 2,52,245 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 2,305 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 53,530 మంది కోలుకున్నారు. 


ఇటలీలో గత 24 గంటల్లో మొత్తం 2,23,096 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 31,368 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,15,288 మంది కోలుకున్నారు. బ్రిటన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,33,151 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 33,614 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 990 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-05-15T17:12:14+05:30 IST