ఏపీలో భారీగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-23T23:51:51+05:30 IST

రాష్ట్రాన్ని కొవిడ్‌ కుదిపేస్తోంది. వేలాది కేసులతో మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదయ్యాయి

ఏపీలో భారీగా కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రాన్ని కొవిడ్‌ కుదిపేస్తోంది. వేలాది కేసులతో మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 21,80,634 పాజిటివ్‌ కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా వల్ల 14,542 మంది చెందారు. రాష్ట్రంలో 83,610 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి 20,82,482 మంది రికవరీ అయ్యారు. 


మరోవైపు మూడోవేవ్‌లో పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం వల్ల తల్లిదండ్రుల్లో ఆందోళన తీవ్రంగా ఉంది. పైగా ఇతర రాష్ట్రాల్లాగా ఏపీలో బడులు మూసేయకుండా నడుపుతుండడంతో కొవిడ్‌బారిన పడి ఏ ప్రమాదం వస్తుందో అనే భయం వారిలో కనిపిస్తోంది. జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించగానే తల్లిదండ్రులు ఆందోళన పడనవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇతర జ్వరాలు కూడా కావొచ్చని, చీటికీమాటికీ పిల్లల్ని ఆస్పత్రులకు కూడా తిప్పొద్దని సూచిస్తున్నారు. 

Updated Date - 2022-01-23T23:51:51+05:30 IST