దేశంలో కరోనా విలయ తాండవం

ABN , First Publish Date - 2021-04-11T16:09:01+05:30 IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. నిరుడు కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరడానికి కొన్ని నెలలు పడితే...

దేశంలో కరోనా విలయ తాండవం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. నిరుడు కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరడానికి కొన్ని నెలలు పడితే... ఈసారి అందుకు కొన్ని వారాలే పట్టింది. అయితే.. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,52,879 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. కరోనా మహమ్మారి వల్ల 839 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 1,33,58,805కు చేరుకుంది. కరోనాతో మొత్తం 1,69,275 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 11,08,087 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35,19,987 మందికి వ్యాక్సినేషన్ తీసుకోగా..దేశంలో మొత్తం 10 కోట్ల 15 లక్షల మంది వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్‎బులిటెన్‎లో వెల్లడించింది.

Updated Date - 2021-04-11T16:09:01+05:30 IST