కరోనా ముప్పును ముందుగా పసిగట్టే ‘రక్తపరీక్ష’

ABN , First Publish Date - 2020-08-12T06:44:51+05:30 IST

ఓ సాధారణ రక్త పరీక్షతో కరోనా ఇన్ఫెక్షన్‌ ముప్పును ముందస్తుగా తెలుసుకోవచ్చని ఫిన్‌లాండ్‌లోని నైటింగేల్‌ హెల్త్‌ బయోటెక్నాలజీ కంపెనీ శాస్త్రవేత్తలు అంటున్నారు...

కరోనా ముప్పును ముందుగా పసిగట్టే ‘రక్తపరీక్ష’

వాషింగ్టన్‌, ఆగస్టు 11 : ఓ సాధారణ రక్త పరీక్షతో కరోనా ఇన్ఫెక్షన్‌ ముప్పును ముందస్తుగా తెలుసుకోవచ్చని ఫిన్‌లాండ్‌లోని నైటింగేల్‌ హెల్త్‌ బయోటెక్నాలజీ కంపెనీ శాస్త్రవేత్తలు అంటున్నారు. యూకే బయోబ్యాంక్‌లో నిల్వచేసిన లక్ష రక్త నమూనాలను విశ్లేషించగా, కరోనా సోకిన వారందరి రక్తంలో ఉమ్మడిగా ఓ ప్రత్యేకమైన  అణువుల సమ్మేళనాన్ని(మాలిక్యులర్‌ సిగ్నేచర్‌) గుర్తించినట్లు వెల్లడించారు. ఇది కలిగిన వారు కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రి పాలయ్యేందుకు 5 నుంచి 10 రెట్లు అవకాశం ఉంటుందని తెలిపారు. 


Updated Date - 2020-08-12T06:44:51+05:30 IST