కరోనా కట్టడికి సమష్టిగా కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-04-13T05:55:49+05:30 IST

సెకండ్‌ వేవ్‌లో విజృంభి స్తున్న కరోనా కట్టడికి అధికారులు సమష్టిగా కృషి చేయా లని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం కలెక్ట రేట్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి సమావేశం నిర్వ హించారు.

కరోనా కట్టడికి సమష్టిగా కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగురామన్న

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 12: సెకండ్‌ వేవ్‌లో విజృంభి స్తున్న కరోనా కట్టడికి అధికారులు సమష్టిగా కృషి చేయా లని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం కలెక్ట రేట్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కో ఆర్డినేషన్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని మండల స్థాయి అధికారులకు కొన్ని గ్రామాలను కేటాయి స్తూ వ్యాక్సినేషన్‌ జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లా మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున ప్రజల రాకపోకలతో వైరస్‌ వ్యాప్తి చెందుతుందని అందుకు సరిహద్దు ప్రాం తంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటించే విధంగా గ్రామాలు, పట్టణా ల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపా రు. డీఎం అండ్‌హెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రస్తుతం 1777యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపారు. రిమ్స్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ రిమ్స్‌లో 350 బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని 400 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సమా వేశంలో ఆర్డీవో రాజేశ్వర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌, అదనపు అధికారి రవీందర్‌ రాథోడ్‌, పోలీసు అధికారులున్నారు.

వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి..

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది, ప్రజా ప్రతినిధులు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని పంచాయతీరాజ్‌, గ్రామీ ణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సందీప్‌కుమారర్‌ సుల్తానీయా అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ పై సమీక్షించారు. జిల్లాలో 6784 మందికి గాను 3201 మంది టీకాకు అర్హత ఉన్నారని ఇప్పటి  వరకు 1236 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని  మిగతా వారు వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నామని జడ్పీ సీఈవో గణపతి తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీపీవో శ్రీనివాస్‌, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్‌రాథోడ్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-04-13T05:55:49+05:30 IST