నిర్మల్: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భైంసా డివిజన్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.