తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2020-07-14T01:44:51+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా 367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభణ

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా 367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,539 మందికి కరోనా సోకింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేయాలని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. కాకినాడ, రాజమండ్రి కార్పోరేషన్లు, కాకినాడ, రాజమండ్రి రూరల్ మండలాల పరిధిలో పాటు అమలాపురం డివిజన్‌లో ఆంక్షలు కఠినంగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. రెడ్‌జోన్, కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్లలో అదనపు ఆంక్షలు కొనసాగనున్నాయి. మెడికల్ షాపులు నిత్యవసరాల దుకాణాలకు మాత్రమే మినహాయించారు. ఆదివారం మటన్, చికెన్, చేపల మార్కెట్లు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-07-14T01:44:51+05:30 IST