రుణాలపైనా కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-06-06T09:29:55+05:30 IST

కరోనా ప్రభావం జిల్లా రుణ ప్రణాళికపై కూడా పడింది. ప్రతి సంవత్సరం జిల్లాలోని ప్రాధాన్యత,

రుణాలపైనా కరోనా దెబ్బ

నెరవేరని ప్రణాళిక లక్ష్యం


నెల్లూరు(హరనాథపురం), జూన్‌ 5 : కరోనా ప్రభావం జిల్లా రుణ ప్రణాళికపై కూడా పడింది.  ప్రతి సంవత్సరం జిల్లాలోని ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు రుణాలు పంపిణీ చేయడానికి ప్రణాళిక తయారవుతుంది. దాని ప్రకారం రుణాలు మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు ఏటా ప్రణాళిక లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేస్తున్నారు. కానీ 2019-20 ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళిక లక్ష్యం వైరస్‌ విపత్తు కారణంగా నెరవేరలేదు. రూ.13110.95 కోట్లు లక్ష్యం కాగా రూ.9880.40కోట్లు పూర్తయింది. 75.35 శాతం మాత్రమే రుణాలు పంపిణీ చేయగలిగారు.


వ్యవసాయ రంగానికి సంబంధించి లక్ష్యం రూ.7486.24 కోట్లుకాగా రూ.5814 కోట్లు మాత్రమే పూర్తయింది. ప్రాధాన్యేతర రంగాల విషయానికి వస్తే రూ.3065.35కోట్ల రుణ పంపిణీ లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.2254.95కోట్ల లక్ష్యం పూర్తయింది. కరోనా ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై ఉండటంతో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించగలమా అనే అనుమానం వారిలో నెలకొంది. రుణ లక్ష్యం నెరవేరక పోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటిగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2020-06-06T09:29:55+05:30 IST