వ్యాపారాలకు కరోనా కాటు

ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST

కరోనా రెండో దశ ఉధృతి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్‌ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన స్థానిక ఆంక్షలు, లాక్‌డౌన్‌లు ఆర్థిక కార్యకలాపాలకు భారీగా గండికొడుతున్నాయి. ఏ ఒక్క రంగం ఈ కల్లోలానికి అతీతంగా లేదు. బుధవారం విడుదలైన

వ్యాపారాలకు కరోనా కాటు

స్థానిక లాక్‌డౌన్లతో పలు రంగాలు కుదేలు


కరోనా రెండో దశ ఉధృతి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

వైరస్‌ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన స్థానిక ఆంక్షలు, లాక్‌డౌన్‌లు ఆర్థిక కార్యకలాపాలకు భారీగా గండికొడుతున్నాయి. ఏ ఒక్క రంగం ఈ కల్లోలానికి అతీతంగా లేదు. బుధవారం విడుదలైన నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 


న్యూఢిల్లీ: దేశంలో వ్యక్తిగత వాహన టోకు విక్రయాలు ఏప్రిల్‌లో 2,61,633 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్చిలో అమ్ముడైన 2,90,939 యూనిట్లతో పోలిస్తే 10.07 శాతం తగ్గినట్టు భారత వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్‌) తెలిపింది. కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాలు విధించిన స్థానిక ఆంక్షలు, లాక్‌డౌన్‌లు వాహన గిరాకీకి గండికొట్టాయని తాజా నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది ఏప్రిల్‌లో ఆటోమొబైల్‌ కంపెనీలు ఒక్క వాహనాన్నీ విక్రయించలేకపోయాయి. సియామ్‌ తాజా డేటా ప్రకారం, మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో డీలర్లకు ద్విచక్ర వాహనాల సరఫరా 33 శాతం తగ్గి 9,95,097 యూనిట్లకు పరిమితం అయింది.


త్రిచక్ర వాహనాలు టోకు విక్రయాలు 57 శాతం క్షీణించి 13,728 యూనిట్లకు పడిపోయాయి. అన్ని విభాగాల టోకు విక్రయాలు 30 శాతం పతనమై 12,70,458 యూనిట్లుగా నమోదయ్యాయి.  ముడిసరుకుల సరఫరా ఇబ్బందులతో వాహన ఉత్పత్తిలోనూ సవాళ్లు కొనసాగుతున్నాయని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ పేర్కొన్నారు. కొనుగోలుదారు సెంటిమెంట్‌ బలహీనపడటంతోపాటు దేశంలో చాలా డీలర్‌షి్‌పలు మూతపడ్డాయన్నారు. ఇది డిమాండ్‌పై స్పష్టమైన ప్రభావం చూపిందన్నారు.  


ఉద్యోగాలూ తగ్గాయ్‌..

వైరస్‌ వ్యాప్తి, స్థానిక లాక్‌డౌన్‌లు ఉపాధి అవకాశాలకూ గండి కొడుతున్నాయని ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ మాన్‌స్టర్‌ వెల్లడించింది. మాన్‌స్టర్‌ ఎంప్లామెంట్‌ ఇండెక్స్‌ ప్రకారం..  మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో దేశవ్యాప్త ఉద్యోగ ప్రకటనలు 3 శాతం తగ్గాయి. గతనెలలో బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైలో మాత్రం జాబ్‌ పోస్టింగ్స్‌ వార్షిక ప్రాతిపదికన పెరిగాయని పోర్టల్‌ స్పష్టం చేసింది.


వాహన విక్రయాల్లో 10% క్షీణత


న్యూఢిల్లీ: దేశంలో వ్యక్తిగత వాహన టోకు విక్రయాలు ఏప్రిల్‌లో 2,61,633 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్చిలో అమ్ముడైన 2,90,939 యూనిట్లతో పోలిస్తే 10.07 శాతం తగ్గినట్టు భారత వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్‌) తెలిపింది. కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాలు విధించిన స్థానిక ఆంక్షలు, లాక్‌డౌన్‌లు వాహన గిరాకీకి గండికొట్టాయని తాజా నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది ఏప్రిల్‌లో ఆటోమొబైల్‌ కంపెనీలు ఒక్క వాహనాన్నీ విక్రయించలేకపోయాయి. సియామ్‌ తాజా డేటా ప్రకారం, మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో డీలర్లకు ద్విచక్ర వాహనాల సరఫరా 33 శాతం తగ్గి 9,95,097 యూనిట్లకు పరిమితం అయింది. త్రిచక్ర వాహనాలు టోకు విక్రయాలు 57 శాతం క్షీణించి 13,728 యూనిట్లకు పడిపోయాయి. అన్ని విభాగాల టోకు విక్రయాలు 30 శాతం పతనమై 12,70,458 యూనిట్లుగా నమోదయ్యాయి.  ముడిసరుకుల సరఫరా ఇబ్బందులతో వాహన ఉత్పత్తిలోనూ సవాళ్లు కొనసాగుతున్నాయని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ పేర్కొన్నారు. కొనుగోలుదారు సెంటిమెంట్‌ బలహీనపడటంతోపాటు దేశంలో చాలా డీలర్‌షి్‌పలు మూతపడ్డాయన్నారు. ఇది డిమాండ్‌పై స్పష్టమైన ప్రభావం చూపిందన్నారు. 


ఇంధన గిరాకీ 9.4% డౌన్‌

స్థానిక లాక్‌డౌన్‌ల కారణంగా గతనెలలో అన్ని రకాల ఇంధన విక్రయాలు 9.4 శాతం తగ్గాయి. కేంద్ర చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలిసిస్‌ సెల్‌ (పీపీఏసీ) తాజా డేటా ప్రకారం.. 2021 ఏప్రిల్‌లో మొత్తం ఇంధన వినియోగం 1.701 కోట్ల టన్నులకు పరిమితమైంది. మార్చిలో వినియోగం 1.877 కోట్ల టన్నులుంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది ఏప్రిల్‌లోనైతే ఇంధన విక్రయాలు సగానికి తగ్గి 2006 నాటి కనిష్ఠానికి పడిపోయాయి. ఈ మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో పెట్రోల్‌ అమ్మకాలు 13 శాతం తగ్గి 23.8 లక్షల టన్నులకు పరిమితం అయ్యాయి. డీజిల్‌ సేల్స్‌ 7.5 శాతం తగ్గి 66.7 లక్షల టన్నులకు పడిపోయాయి. విమాన ఇంధన విక్రయాలు 14 శాతం క్షీణతతో 4.09 లక్షల టన్నులుగా, వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) విక్రయాలు 6.4 శాతం తగ్గుదలతో 21 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.  తారు (బిటుమెన్‌) వినియోగం 6.58 లక్షల టన్నులకు పడిపోయింది.

Updated Date - 2021-05-13T05:30:00+05:30 IST