Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాక్సిన్‌తో కరోనా కట్టడి

- జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు

ఇల్లంతకుంట, డిసెంబరు 8: వ్యాక్సిన్‌ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు. మండలంలోని పొత్తూర్‌, జవారిపేట, గాలిపెల్లి, పెద్దలింగాపూర్‌, దాచారం గ్రామాల్లోని వ్యాక్సినేషన్‌ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు రెండుడోసుల వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు.  మండలంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయలన్నారు. ఇప్పటి వరకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోనివారిని గుర్తించాలని, వారి ఇళ్ల వద్దకు వెళ్లి వ్యాక్సిన్‌ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సుభాషిణి, సిబ్బంది ఖుద్దుస్‌, నయీం, ఏఎన్‌ఎమ్‌లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.


Advertisement
Advertisement