Abn logo
Jun 11 2021 @ 03:20AM

సమష్టి పోరాటంతోనే కరోనా కట్టడి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌


విజయవాడ సిటీ, జూన్‌ 10: ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమష్టి పోరాటంతోనే కరోనాను కట్టడి చేయగలుగుతామని, అదే అందరి కర్తవ్యమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ తెలిపారు. అమెరికన్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ (ఆపి) అందించిన 200 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను విజయవాడలోని రెడ్‌క్రాస్‌ రాష్ట్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.శ్రీధర్‌రెడ్డికి ఆయన గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్ధితుల్లో అమెరికాలో ఉన్న తెలుగువారు స్పందించి ఉదారంగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌, మెడికల్‌ కిట్స్‌ అందించడం అభినందనీయమన్నారు. కరోనా సమయంలో రెడ్‌క్రాస్‌ సేవలు మరువలేనివన్నారు. డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలో 18 ఆక్సిజన్‌ బ్యాంకులు ఏర్పాటు చేశామన్నారు.