కడప, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వ్యవధిలో మరో 236 మందిలో పాజిటివ్ వైరస్ నిర్ధారణ అయింది. జిల్లా వ్యాప్తంగా 4.6 శాతం పాజిటివిటీ నమోదైంది. ఆస్పత్రిలో 25 మంది, హోం ఐసోలేషనలో 523 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న 24 మందిని డిశ్చార్జ్ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,16,814 మంది కోరానా బారిన పడగా 714 మంది మృతిచెందారు. కరోనా నుంచి 1,15,451 మంది కోలుకున్నారు. కొవిడ్ థర్డ్‌వేవ్ నేపథ్యంలో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ధరించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని ఎస్పీ కేకేఎన అన్బురాజన శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.