ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2022-01-24T23:32:08+05:30 IST

రాష్ట్రంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి.

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా

అమరావతి: రాష్ట్రంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,95,136కు పెరిగింది. 24 గంటల్లో కరోనాతో  ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 14,549 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 93,305 యాక్టివ్‌ కేసులున్నాయి. మహమ్మారి ముంచుకోస్తోన్నది. మొదటి రెండు వేవ్‌లకన్నా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటోందన్న హెచ్చరికలు వాస్తవమవుతున్నాయి. అయినా ప్రజల్లో కనీస జాగ్రత్తలపై శ్రద్ధ ఉండటంలేదు. కరోనా నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. నిబంధనలు పక్కాగా అమలు చేసి కట్టడికి చర్యలు తీసుకునే వారే లేకుండా పోయారు. ఇదే అవకాశంగా ప్రజలు ఇష్టం వచ్చినట్లు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక కరోనా టెస్టులు సక్రమంగా జరగకపోవడం.. గతంలో ఉన్నట్లు కేంద్రాలు అందుబాటులో లేక పోవడం.. ఎక్కడ చేస్తున్నారో తెలియక పోవడం.. తదితరాలతో కరోనా బాధితుల గుర్తింపు కష్టంగా ఉంటోంది. 


Updated Date - 2022-01-24T23:32:08+05:30 IST