కరోనా అలారం

ABN , First Publish Date - 2021-06-15T17:02:00+05:30 IST

కొవిడ్‌ సోకిన వ్యక్తులను కనిపెట్టాలంటే కొవిడ్‌ పరీక్షలు చేయవలసిందే! అయితే శరీరం నుంచి వెలువడే వాసన ఆధారంగా కొవిడ్‌ సోకినట్టు కనిపెట్టే అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి రానుంది.

కరోనా అలారం

ఆంధ్రజ్యోతి(15-06-2021)

కొవిడ్‌ సోకిన వ్యక్తులను కనిపెట్టాలంటే కొవిడ్‌ పరీక్షలు చేయవలసిందే! అయితే శరీరం నుంచి వెలువడే వాసన ఆధారంగా కొవిడ్‌ సోకినట్టు కనిపెట్టే అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి రానుంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు పలు అధ్యయనాల ద్వారా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నిర్దిష్టమైన వాసన కలిగి ఉంటుందని కనుగొన్నారు. ఇన్‌ఫెక్షన్‌ సోకడం మూలంగా శరీరంలోని వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌లో వచ్చే మార్పుల వల్ల శరీరం నుంచి వెలువడే వాసనలో మార్పులు చోటు చేసుకుంటాయనీ, వ్యక్తిని బట్టి భిన్నంగా ఉండే ఆ వాసనలను సెన్సార్లతో గుర్తించే వీలుందనీ ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు.


దీన్ని బట్టి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తులను కనిపెట్టే ఆర్గానిక్‌ సెమి కండక్టింగ్‌ సెన్సార్లు, కొవిడ్‌ స్ర్కీనింగ్‌ పరికరాలుగా మున్ముందు వాడుకలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ర్యాపిడ్‌, నాన్‌ ఇన్వేసివ్‌ పరీక్షలతో సమానంగా కచ్చితమైన ఫలితాలను అందించేలా ఈ పరికరాలను అభివృద్ధి చేయగలిగితే, భవిష్యత్తులో కరోనా విస్తృతికి తేలికగా అడ్డుకట్ట వేయవచ్చు.

Updated Date - 2021-06-15T17:02:00+05:30 IST