ఆత్మకూర్(ఎస్) మండలంలో రక్త నమునాలను సేకరిస్తున్న ఐసీఎంఆర్ బృందం సభ్యులు
కోదాడలో నలుగురికి, హుజూర్‌నగర్‌లో ముగ్గురికి పాజిటివ్
గడ్డిపల్లి బ్యాంక్‌లో ఐదుగురు,తిప్పర్తిలో మహిళా ఉద్యోగికి
కోదాడ రూరల్, హుజూర్‌నగర్, గరిడేపల్లి రూరల్, జనవరి 18: పోలీస్ సిబ్బందిని కరోనా వేధిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో 12 మందికి, ఆత్మకూరు(ఎం) పోలీ్‌సస్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లకు, మర్రిగూడ సీఐ కరోనా బారినపడి హోంక్వారంటైన్‌లో చికిత్సపొందుతున్నారు. కాగా, తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీ్‌సస్టేషన్‌లో విధులు నిర్వహిస్తు న్న ఓ ఏఎ్‌సఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డుకు మంగళవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదేవిధంగా హుజూర్‌నగర్ పోలీ్‌సస్టేషన్‌లో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీ్‌సశాఖలో కలకలం రేగింది. కాగా, మిగతా సిబ్బంది పరీక్షలు చేయించుకోగా, అందరికీ నెగటివ్‌గా వచ్చింది. పోలీస్ స్టేషన్లను మునిసిపల్ సిబ్బం ది శానిటైజ్ చేశారు. కాగా, మరికొందరికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గరిడేపల్లి మండల పరిధిలోని గడ్డిపల్లి ఎస్‌బీఐలో ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సోమ, మంగళవారం బ్యాంక్ కార్యకలాపాలు నిలిపి శానిటైజ్ చేశారు. అదేవిధంగా తిప్పర్తి మండల కేంద్రంలోని ఏపీజీవీబీలో ఓ మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఉమ్మడి జిల్లాలో 436 మందికి పాజిటివ్
దేవరకొండ, డిండి, పెద్దఅడిశర్లపల్లి, మర్రిగూడ, తిప్పర్తి, చిట్యాల రూరల్, శాలిగౌరారం, ఆత్మకూరు (ఎం) : ఉమ్మడి జిల్లాలో 436మందికి మంగళవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం 71 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయ గా,17మందికి పాజిటివ్ వచ్చింది.డిండి మండలంలో 130 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్ వచ్చిం ది. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పీహెచ్‌సీలో 56 మంది కి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్, గుడిపల్లి జీ హెచ్‌సీలో 60 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. మర్రిగూడ మండలంలో ఏడు పాజిటి వ్ కేసులు నమోదయ్యాయి. తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. చిట్యాల మం డలం వెలిమినేడు పీహెచ్‌సీ పరిధిలో ముగ్గురికి, శాలిగౌరా రం పీహెచ్‌సీలో 92 మందికి పరీక్షలు చేయగా, నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆత్మకూరు(ఎం) పీహెచ్‌సీలో 57 మందికి పరీక్షలు చేయగా, నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో మంగళవారం 436 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఐసీఎంఆర్ బృందం పర్యటన
ఆత్మకూర్(ఎస్): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని దాచారం గ్రామంలో ఐసీఎంఆర్ బృం దం మంగళవారం పర్యటించింది. ప్రజల్లో కరోనా యాంటీబాడీలు ఎంతమేర అభివృద్ధి చెందాయో పరిశీలించేందుకు ఐసీఎంఆర్ బృందం పలువురి నుంచి స్వాబ్ నమూనాలు సేకరించింది. వీటిని విశ్లేషించి యాంటీబాడీలను అంచనా వేయనున్నారు. బృందం వెంట వైద్యాధికారి మురళీకృష్ణ, ఉపసర్పంచ్ శంకర్, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్ రంగమ్మ, ఏఎన్‌ఎం అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.