కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-07-11T09:37:04+05:30 IST

జిల్లాలో కరోనా మహ మ్మారి కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు భారీ గా పెరుగుతున్నాయి

కరోనా కలకలం

జిల్లాలో మరో 17 మందికి పాజిటివ్‌... 

171కి పెరిగిన కరోనా కేసులు... 


మంచిర్యాల అర్బన్‌, జూలై 10: జిల్లాలో కరోనా మహ మ్మారి కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు భారీ గా పెరుగుతున్నాయి. తాజాగా 22 నమూనాలు పంపగా  శుక్రవారం 17 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  మం చిర్యాలలో 9 మంది ఉన్నారు. పట్టణంలోని శ్రీనివాస థియేటర్‌ ఏరియాలో ముగ్గురు, అవోపా కాలనీ, హమా లివాడ, ఎన్టీఆర్‌నగర్‌, తిలక్‌నగర్‌, పాత మంచిర్యాల, జన్మభూమినగర్‌లో ఒక్కో కేసు నమోదైంది. మిగతా 8 కేసులు ఆయా మండలాల్లో నమోదయ్యాయి. ఈ కేసు లన్నీ గతంలో నమోదైన ప్రైమరీ కాంటాక్ట్‌ నుంచి వారి దగ్గరగా ఉన్న వారివేనని తెలుస్తోంది. జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 171కి చేరింది. ఇప్పటివరకు 458 నమూ నాలు పంపగా 296 నెగెటివ్‌ వచ్చాయి. 111 మంది డి శ్చార్జి కాగా 58 యాక్టివ్‌ కేసులున్నాయి. బెల్లంపల్లి ఐసో లేషన్‌లో 72 మంది ఉన్నారు. శుక్రవారం 15 మంది నమూనాలను పంపించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అ ధికారి డా.నీరజ విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. 


బెల్లంపల్లి టౌన్‌: బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం మరొకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని జిల్లా నోడల్‌ అధికారి బాలాజీ ప్రకటించారు. ఈ కేసుతో బెల్లం పల్లి పట్టణం, మండలంలో కరోనా పాజిటివ్‌ సంఖ్య 46కు చేరింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి వచ్చిన వ్యాపారి ఒకరు బెల్లంపల్లి ఐసోలేషన్‌లో చేరాడు. ఈనెల 8న రక్తనమూనాలు హైదరాబాద్‌ గాంధీ ఆసుప త్రికి పంపగా శుక్రవారం పాజిటివ్‌ వచ్చింది. స్టేషన్‌ రోడ్డు కాలనీలో తాజా కేసు నమోదు కావడం, ఇప్పటికే 9 పాజిటివ్‌ కేసులు ఉండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  


శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ ఏరియాలో శుక్రవారం మరో యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.  కృష్ణా కాలనీలో నివాసం ఉంటున్న యువకుడు మంచి ర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నాడు.  నాలుగు రోజుల క్రితం జ్వరం, జలుబు రావడంతో బెల్లం పల్లి ఐసోలేషన్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపగా శుక్రవా రం పాజిటివ్‌ నిర్థారణ అయినట్లు వైద్యాధికారులు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. వెంటనే యువకుడిని  బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలించారు. యువకుడితో సం బంఽధం ఉన్న వ్యక్తులను హోం క్వారంటైన్‌ చేశారు. 


నస్పూర్‌ : నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో నలుగు రికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో అప్రమ త్తమైనా అధికారులు వారు నివాసం ఉంటున్న నాగా ర్జున కాలనీ, నస్పూర్‌ కాలనీ, తీగల్‌పహాడ్‌లోని శ్రీరాంన గర్‌ ఏరియాల్లో శుక్రవారం పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. కాలనీల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్ల్లి, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం స్ర్పే చేశారు. సీసీసీ నస్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నలుగురికి కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని, ఆయా ప్రాంతాలను కట్టడి ప్రాంతా లుగా చేశామని  ఎస్సై ప్రమోద్‌రెడ్డి తెలిపారు. 


జైపూర్‌: జైపూర్‌ మండలంలో శుక్రవారం తొలి కరోనా కేసు నమోదైంది. ఇందారం బస్టాండ్‌ ఏరియాలో  కిరా ణ వ్యాపారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇతని సోద రుడు హైదరాబాద్‌ నుంచి మంచిర్యాలకు రావడంతో అతడిని కలిసివచ్చాడు. అనంతరం అతనికి పాజిటివ్‌ రావడంతో బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో అస్వస్థతకు గురైన వ్యాపారి పరీక్షలు చేయించుకున్నాడు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా సర్వేకల్‌ అధికారి డాక్టర్‌ బాలాజీ  శుక్రవారం తెలిపారు. వెంటనే  అతనిని ఐసోలేషన్‌కు పంపించారు. కిరాణ దుకాణం సమీపంలో ఉంటున్న షాపులను మూసి వేయించారు.  వ్యాపారి నివాసం ఉంటున్న గౌడ వాడను కట్టడి ప్రాం తంగా ప్రకటించి, అతని కుటుంబ సభ్యులను, ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్న 10 మందిని హోం క్వా రంటైన్‌ చేశారు. ఇందా రంలో  తొలి కరోనా కేసునమోదు కావడంతో గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు. కుందారం పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ నీరజ, ఎస్‌ఐ విజేందర్‌, ఏఎన్‌యం కృష్ణవేణి, సర్పంచ్‌ మంజుల పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు.  


చెన్నూర్‌: కిష్టంపేటలో కిరాణ షాపు నిర్వాహకుడికి పాజిటివ్‌ రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షీంచిన వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నాయని నిర్థారించి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి వైద్యులు బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలించారు. అతని సమూనాలను పరీక్షలకు పంపగా  పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యాధికారులు గ్రామానికి చేరుకొని అతని కుటుంబ సభ్యులు 9 మందిని హోంక్వారంటైన్‌ చేశారు. కిరాణ షాపు నిర్వహిస్తుండడంతో ఎంతమంది ఇతని దగ్గరి వచ్చి ఉం టారనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. సీఐ ప్రమోద్‌రావు, ఎస్‌ఐ సంజీవ్‌, సర్పంచ్‌ బుర్ర రాకేష్‌గౌడ్‌లు కాలనీలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-07-11T09:37:04+05:30 IST