కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-04-08T05:14:37+05:30 IST

జిల్లాలో కరోన విలాయతాండవం చేస్తోంది. ప్రజల అలసత్వం, కరోనా సోకిన వారి నిర్లక్ష్యంతో ఆరోగ్యవంతులు సైతం కరోనా బారిన పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

కరోనా కలకలం

జిల్లాలో బుధవారం 263 కరోనా కేసుల నమోదు
ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ని వదలని కరోనా
రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
అత్యధికంగా కామారెడ్డి, బీర్కూర్‌, డోంగ్లీలో
గ్రామాల్లోనూ పదుల సంఖ్యలో నమోదు
వైరస్‌ సోకిన వారు విచ్చల విడి సంచారమే కారణం
కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 7: జిల్లాలో కరోన విలాయతాండవం చేస్తోంది. ప్రజల అలసత్వం, కరోనా సోకిన వారి నిర్లక్ష్యంతో ఆరోగ్యవంతులు సైతం కరోనా బారిన పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో గత నెలరోజుల నుంచి కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతునే ఉంది. బుధవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో 263 కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా కామా రెడ్డి ప్రాంతంలో అత్యధిక కేసులు నమోదవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్న వైద్యసిబ్బ ందికి కరోనా పాజిటివ్‌ రావడంతో మిగిలిన వైద్యసిబ్బంది జంకే పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే పట్టణంలో ఇతర ప్రాం తాల నుంచి, గ్రామాల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుండడ ంతో వైరస్‌ ఒక చోటు నుంచి మరో చోటుకు వ్యాపిస్తోందని తెలుస్తోంది. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులు హోం క్వారంటైన్‌లో ఉండకుండా విచ్చలవిడిగా బయట సంచరిస్తుండడంతోనే వైరస్‌ విజృంభణ ఎక్కువగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కరో నా పాజిటివ్‌ వచ్చిన వారిపై వైద్యఆరోగ్యశాఖ అధికారులు నిఘా ఉంచితే తప్ప కరోనా కేసులు కట్టడి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్య ంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటేనే మహమ్మారి బారినపడకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యనిపుణులు పేర్కొంటు న్నారు.
డబుల్‌ సెంచరీ దాటిన కరోనా కేసులు
జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు డబుల్‌ సెంచరీని దాటా యి. గత వారం రోజుల కిందట వందలోపు నమోదయిన కరో నా కేసులు ప్రస్తుతం డబుల్‌ సెంచరీని దాటిపోవడంపై సర్వ త్రా ఆందోళన నెలకొంటుంది. బుధవారం 29 ప్రభుత్వ ఆసుప త్రులలో నిర్వహించిన కరోనా పరీక్షలలో కామారెడ్డి పట్టణంలో 27, బాన్సువాడలో 24, ఎల్లారెడ్డి 10, దోమకొండ 4, మద్నూర్‌ 12, ఎర్రాపహాడ్‌ 7, రాజంపేట 1, దేవునిపల్లి 15, రాజీవ్‌నగర్‌ 15, మత్తమాల్‌ 9, లింగంపేట 1, బీర్కూర్‌ 32, డోంగ్లీ 64, ఉత్తూనూర్‌ 8, మత్తమాల్‌ 9, లింగంపేట 1, హన్మాజీపేట 4, జుక్కల్‌ 2, పెద్దకొడప్‌గల్‌ 12 కేసులు నమోదు కాగా ఆర్‌టీపీఏసీఆర్‌ ద్వారా నిర్వహించిన పరీక్షల్లో మరో 16 కేసులు నమోదయ్యాయి.
కామారెడ్డిలోనే అత్యధికంగా విజృంభిస్తున్న కరోనా

జిల్లాలోని ఆయా మండలాల నుంచి అత్యధికంగా ప్రజలు పట్టణ కేంద్రాలకు రావడం భౌతికదూరం పాటించకపోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించడంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోం ది. కరోనా కేసులలో అత్యధికంగా కామారెడ్డి పట్టణంలోనే కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు ఎక్కడ కూడా కరోనా నిబంధన లు పాటించకపోవడం చిరు వ్యాపారి నుంచి బడా వ్యాపారుల వరకు కరోనా నిబంధనలను భేఖాతారు చేస్తుండడంతో వైరస్‌ విజృంభణ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. పట్టణంలో సుభాష్‌రోడ్డు, స్టేషన్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, నిజాంసాగర్‌ రోడ్డు, కొత్త బస్టాండ్‌ ప్రాంతాల్లో ఉన్న దుకాణ సముదాయాల నిర్వాహకులు మాస్క్‌లు ధరించని వారిని సైతం లోనికి రావడం గుంపులు గుంపులుగా ఒకేచోట చేరిన వారికి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం. కేవలం తమ వ్యాపారంపై మాత్రమే దృష్టి సారిస్తు న్నారే తప్ప కరోనా విజృంభణపై ఎక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వీరిపై అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించడంతో కరోనా ఒకరి నుంచి మరొక్కరికి త్వరగా వ్యాప్తి చెందుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లోనూ కలకలం సృష్టిస్తున్న కరోనా
కరోనా విజృంభణ సమయం నుంచి ఎక్కువ శాతం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా వైరస్‌  ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో గ్రామీణ ప్రాంతా ల్లో రోజు రోజుకూ వందల సంఖ్యలలోనే కేసులు నమోదవుతు న్నాయి. గత రెండు రోజుల నుంచి బీర్కూర్‌ పీహెచ్‌సీ పరిధిలో 21కి పైగానే కేసులు నమోదు కాగా, బుధవారం 32 కేసులు నమోదయ్యాయి. డోంగ్లీలో 64కేసులు నమోదయ్యాయి. నస్రూ ల్లాబాద్‌ మండలం సంగెం గ్రామంలోనే గత మూడు రోజులుగా కేసులు ఎక్కువగా నమోదవుతుండడం చూస్తేనే అర్థమవుతో ంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కరోనా ఏ విధంగా కలకలం సృష్టిస్తుందోననేది. కరోనా విజృంభణ ఇంతలా ఉంటున్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు నిర్లక్ష్యం వీడడం లేదు. చాలా మట్టుకు ఎక్కడ భౌతికదూరం పాటించకపోవడం, మా స్క్‌లు ధరించకపోవడంతోనే కరోనా విజృంభిస్తుందనే అభిప్రా యాలు వైద్యనిపుణుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయనియంత్రణ పాటిస్తూ అవసరమై తేనే బయటకు రావడం వచ్చినా గుంపులు గుంపులుగా సంచరి ంచకపోతేనే కట్టడికి సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు.
మద్నూర్‌లో 75..
మద్నూర్‌, ఏప్రిల్‌ 7: మహారాష్ట్రలో రోజు రోజుకూ విజృంభి స్తున్న కరోనా ప్రభావం మద్నూర్‌ మండలంలో పంజా విసిరి ంది. మండలంలో బుధవారం ఒకే రోజు మూడు గ్రామాల్లో 75కేసులు నమోదయ్యాయి. మండలంలోని సరిహద్దు గ్రామ మైన చిన్నశక్కర్గ గ్రామంలో 76 మందికి కరోనా పరీక్షలు నిర్వ హించగా, 15 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. చిన్న ఎక్లారా గ్రామంలో 152మందిని పరీక్షించగా 49 మందికి కరోనా పాజి టివ్‌ వచ్చింది. అదేవిధంగా మేనూర్‌లో 11 మందికి, ఒకేరోజు 75 మందికి పాజిటివ్‌ రావడంతో మండలంలో ప్రజలు భయా ందోళనకు గురవుతున్నారు. మద్నూర్‌ మండలం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందు వల్లనే కరోనా విజృంభిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మహారాష్ట్రకు వెళితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని డోంగ్లీ వైద్యుడు అశ్విన్‌ బాబు సూచించారు.
బిచ్కుందలో 7..
బిచ్కుంద : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం 21మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.
పెద్దకొడప్‌గల్‌లో 6..
పెద్దకొడప్‌గల్‌: పెద్దకొడప్‌గల్‌ మండలంలో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి శరత్‌ తెలిపా రు. పెద్ద కొడప్‌గల్‌ మండల కేంద్రానికి చెందిన ఇద్దరికి, బూర్గు పల్లికి చెందిన ఒకరికి, వడ్లంకు చెందిన ఒకరికి కరోనా పాజి టివ్‌గా నమోదైందన్నారు.  
సదాశివనగర్‌లో 8..
సదాశివనగర్‌: మండలంలోని పీహెచ్‌సీలో, ఉత్తునూర్‌ ఉప కేంద్రంలో 49 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యుడు హరికృష్ణ తెలిపారు. ఇందులో చద్మాల్‌తండా 1, గుడితండా 4, నిజామాబాద్‌ 2, ఉత్తునూర్‌ 1 కేసులు ఉన్నాయి.
బీర్కూర్‌లో 32..
బీర్కూర్‌: బీర్కూర్‌ పీహెచ్‌సీ పరిధిలో 32 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు. సంగెం గ్రామంలో 23, దామరంచలో 2, నస్రుల్లాబాద్‌లో 4, తిమ్మాపూర్‌లో ముగ్గురు చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు.

Updated Date - 2021-04-08T05:14:37+05:30 IST