కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: కొప్పుల డిమాండ్

ABN , First Publish Date - 2021-05-18T18:32:27+05:30 IST

ఎల్బీ నగర్‌లో ఖాళీగా ఉన్న హాస్టళ్లు, కాలేజీలను లీజుకు తీసుకొని కరోనా పాజిటివ్ వచ్చిన వారికి అందుబాటులో ఉండే విధంగా ఇసోలేషన్ సెంటర్లుగా ...

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: కొప్పుల డిమాండ్

హైదరాబాద్: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా(అర్బన్) బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని, ఆరోగ్యశ్రీ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. జోనల్ కమిషనర్‌తో సమావేశం అనంతరం మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ఎల్బీ నగర్‌లో ఖాళీగా ఉన్న హాస్టళ్లు, కాలేజీలను లీజుకు తీసుకొని కరోనా పాజిటివ్ వచ్చిన వారికి అందుబాటులో ఉండే విధంగా ఇసోలేషన్ సెంటర్లుగా ఏర్పాటు చేయాలని కోరారు. జోనల్ కమిషనర్‌ను కలిసిన వారిలో రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామా రంగారెడ్డి, రాష్ట్ర బీసీ మోర్చా నేత చింతల సురేందర్ యాదవ్, హయత్ నగర్ కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డి ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2021-05-18T18:32:27+05:30 IST