కరోనా వ్యాపించకుండా అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2020-11-22T03:28:11+05:30 IST

కరోనా వ్యాపించకుండా అవగాహన కల్పించాలి

కరోనా వ్యాపించకుండా అవగాహన కల్పించాలి

కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు


మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ నవంబరు 21: శీతాకాలం మరియు పండగ సీజన్‌ల నేప థ్యంలో రెండో విడత కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉందన్న వైద్య నిపు ణులు హెచ్చరికల దృష్ట్యా గ్రామాల్లో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జిల్లాలోని  తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్‌లు, మండల పంచాయతీ అధి కారులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు, స్వయం సహాయక మహిళా సంఘాలు సభ్యులకు ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, అంతేగాక శీతాకాలం పండుగల సీజన్‌ కారణంగా కూడా వైర స్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు 15 రోజులపాటు గ్రామాల్లో కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగం గా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామైక్య సంఘాల సభ్యులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.


విద్యార్థులు లక్ష్య సాధనతో ముందుకు సాగలి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, నవంబరు 21: విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని కలెక్టర్‌ వెంకట్రావ్‌ అన్నారు. ట్రిపుల్‌ ఐటీ, నీట్‌ సీట్లు సాధించిన విద్యార్థులతో శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ మా ట్లాడారు. విద్యార్థులు భవిష్యత్తులో ఒక మంచి స్థానంలో స్థిరపడేందుకు ఇప్పటి నుంచే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో ఉషారాణి,  పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T03:28:11+05:30 IST