కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2020-11-03T09:47:41+05:30 IST

వేగంగా వ్యాప్తి చెందు తున్న కరోనా వైరస్‌తోపాటు మృతుల సంఖ్య పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మృతుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒకరు, నాన్‌జీహెచ్‌ఎంసీ పరిధిలో

కరోనా విజృంభణ

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : వేగంగా వ్యాప్తి చెందు తున్న కరోనా వైరస్‌తోపాటు మృతుల సంఖ్య పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మృతుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒకరు, నాన్‌జీహెచ్‌ఎంసీ పరిధిలో మరొకరున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మృతి చెందిన వారిసంఖ్య 313కు చేరుకుంది.


ఉమ్మడి జిల్లాలో 362 కేసులు..

ఉమ్మడిజిల్లాలో సోమవారం 362కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 206 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 127 కేసులు నమోదయ్యాయి. అలాగే వికారాబాద్‌ జిల్లాలో 29 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడు జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 96,606కి చేరుకుంది. 


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 191 మందికి కరోనా పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 12 మంది పరీక్షలు చేయగా 1, ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 38 మందికి పరీక్షలు చేయగా 5, శంకర్‌పల్లి మండలంలో 51 మందికి  పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. మొయినాబాద్‌ మండలంలో 50మందికి పరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. షాబాద్‌ మండలంలో 40 మందికి  పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు.


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో..

ఇబ్రహీంపట్నం / కందుకూరు / శంషాబాద్‌ : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో సోమవారం 10 కేంద్రాల్లో 236 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 19 మందికి పాజిటివ్‌ వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ 8, ఇబ్రహీంపట్నం 1, దండుమైలారం 4, రాగన్నగూడలో ఆరుగురికి పాజిటివ్‌ అని తేలింది. కందుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 25మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటీవ్‌ వచ్చింది. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 44 మందికి కరోనా పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది.


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌ : షాద్‌నగర్‌ డివిజన్‌లో సోమవారం 263 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో షాద్‌నగర్‌కు చెందిన ఆరుగురు, కొత్తూర్‌ మండలానికి చెందిన ఐదుగురు, నందిగామ మండలానికి చెందిన ఒకరున్నారు. 


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం వికారాబాద్‌లో 9 కేసులు, తాండూరులో 9, పరిగిలో 4, బషీరాబాద్‌లో 3, దోమలో 2, యాలాల్‌, దౌల్తాబాద్‌లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌ సింధే తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా కేసులు 2534 నమోదుకాగా, వాటిలో 212 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో 10 మంది వివిధ ఆసుపత్రుల్లో, 202 మంది హోంకేర్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. 


పరిగిలో...

పరిగి : పరిగి మండలంలో 61మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రంగాపూర్‌తండా, నారాయణపూర్‌, ఖాన్‌కాలనీ, సుల్తాన్‌నగర్‌లలో ఒక్కొ క్కరికి పాజిటివ్‌ వచ్చింది.


మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో 48 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 16మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది.

Updated Date - 2020-11-03T09:47:41+05:30 IST