తగ్గని కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-09-25T06:00:10+05:30 IST

జిల్లాలో కొత్తగా మరో 120 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో

తగ్గని కరోనా ఉధృతి

జిల్లాలో కొత్తగా 120 మందికి కరోనా  

చికిత్స పొందుతూ ఐదుగురి మృతి 


కరీంనగర్‌, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొత్తగా మరో 120 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. జిల్లా వ్యాప్తంగా గురువారం ఐదుగురు కొవిడ్‌ బారినపడి మృతిచెం దారు. కరీంనగర్‌ పట్టణంలోని హుస్సేనిపురాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి, మంకమ్మ తోటకు చెందిన 50 సంవత్సరాలు, శివనగర్‌కు చెందిన 70 సంవత్సరాల వ్యక్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్‌ బారిన పడి చికిత్స పొందుతూ మృతిచెం దారు. అలాగే కరీంనగర్‌ రూరల్‌ మండల పరిధిలోని దుర్శేడ్‌లో 45 సంవత్సరాల వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలోనే మరణించాడు. హుజురాబాద్‌కు చెందిన ఒకరు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలి సింది. గురువారం జిల్లా వ్యాప్తంగా 250 నుంచి 300 వరకు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిసింది. జిల్లా జైలులో రెండురోజులుగా ఖైదీలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా బుధవారం 30 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. 


చిగు రుమామిడి మండలంలో నాలుగు, ఇల్లందకుంట మండలంలో 13, తిమ్మాపూర్‌ మండలంలో 12, శంకరపట్నం మండలంలో 4, రామడుగు మండలంలో 14, గంగాధర మండలంలో 9, వీణవంక మండలంలో 3, కరీంనగర్‌ రూరల్‌లో ఒకటి, కొత్తపల్లిలో 9, చొప్పదండి మండలంలోలో రెండు పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. హుజురాబాద్‌లో 12 మంది, సైదాపూర్‌లో ఐదుగురు, గన్నేరువరం మండలంలో ముగ్గురు, మానకొండూర్‌ 11, జమ్మికుంట 24 మందికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. కరీంనగర్‌ పట్టణంలోని కాపువాడలో ఒకరు, మారు తీనగర్‌లో ముగ్గురు, లక్ష్మీనగర్‌లో ముగ్గురు, కోతిరాంపూర్‌లో ఇద్దరు, అశోక్‌ నగర్‌లో ముగ్గురు, రాఘవేంద్రనగర్‌లో ఒకరు, హౌసింగ్‌బోర్డులో ముగ్గురు వ్యాధిబారిన పడ్డారు. విద్యానగర్‌లో 17 మంది, బుట్టిరాజారాంకాలనీలో 13 మం ది, సప్తగిరికాలనీలో ఇద్దరు, మంకమ్మతోటలో ఇద్దరు, ప్రగతినగర్‌లో ఇద్దరు, సుభాష్‌నగర్‌లో ఇద్దరు, సాయినగర్‌లో ఇద్దరు, అంబేద్కర్‌నగర్‌లో ఒకరు, క్రిస్టియ న్‌కాలనీలో ఒకరు, వావిలాలపల్లిలో ఒకరు, విద్యారణ్యపురిలో ఒకరు, కట్టరాం పూర్‌లో ఒకరు, జ్యోతినగర్‌లో ఒకరు, భగత్‌నగర్‌లో తొమ్మిదిమందికి సోకింది.

Updated Date - 2020-09-25T06:00:10+05:30 IST