గ్రామీణ ప్రాంతాల్లో కరోనా జోరు

ABN , First Publish Date - 2020-08-06T11:07:40+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా జోరు

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా జోరు

ఏలూరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం కరోనా కేసుల సంఖ్య భారీగా పెరి గింది. సోమ, మంగళవారాల్లో 600లోపు కేసులు నమోదు కాగా బుధవారం ఒక్కరోజే 736 కరోనా పాటిజివ్‌ కేసులు నమోదవగా ముగ్గురు మృత్యు వాత పడ్డారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతా ల్లో అధికంగా కొవిడ్‌ బాధితులు పెరుగుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 16,233కు చేరింది. ఏలూరు సహా భీమవరం, తణుకు, నరసా పురంలో కేసులు పెరిగాయి. ఏలూరులో 84, భీమవరం 66, తణుకు 57, నరసా పురం 44 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు స్వల్పంగా నమోదవుతున్న తణుకులో బుధవారం ఒక్కసారిగా కేసులు పెరిగాయి. తాడేపల్లి గూడెం 31, కొవ్వూరు 26, జంగారెడ్డిగూడెం 23, నిడదవోలు 20 కేసులు వెలుగు చూశాయి. పాలకొల్లులో 5 కేసులు నమోదు కొంత ఊరటనిచ్చింది. గ్రామీణ ప్రాంతాలు కరోనా వ్యాప్తిలో పట్టణాలతో పోటీ పడుతున్నాయి. ఉంగుటూరు మండలంలో 27, అత్తిలి 23, పోడూరు 22, చింతలపూడి 21,  చాగల్లు 18, పెద పాడు 16, పెనుమంట్ర 14, మొగల్తూరు 13, పెంటపాడు 10, యలమంచిలి 10, కొయ్యలగూడెం, పోలవరం, గోపాలపురంలో 9 చొప్పున కేసులు నమోదు కాగా ద్వారకా తిరుమల, వీరవాసరం, గణపవరం, ఆకివీడు, ఉండి, దేవరపల్లి, పెదవేగి, మండలాల్లో 5, అంతకంటే తక్కువ వచ్చాయి.

Updated Date - 2020-08-06T11:07:40+05:30 IST